ర‌ఘుప‌తి వెంక‌య్య ఫిలింన‌గ‌ర్ అని మార్చాలి

Update: 2020-03-16 14:20 GMT
తెలుగు సినీ పరిశ్రమ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన రఘుపతి వెంకయ్యనాయుడు పేరును ఫిల్మ్‌ నగర్‌ పేరుకు జతపరచి `రఘుపతి వెంకయ్య నాయుడు ఫిల్మ్‌ నగర్‌` మార్చాల‌న్న డిమాండ్ ప్ర‌స్తుతం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. గురువారం రఘుపతి వెంకయ్య 79వ వర్థంతి సందర్భంగా ఫిలిం  ఛాంబర్‌ ఎదురుగా ఉన్న రఘుపతి వెంకయ్య విగ్రహానికి పలువురు సినీ ప్రముఖులు నివాళి అర్పించి ఆ మేర‌కు పేరు మార్పు విష‌యాన్ని క‌మిటీ స‌భ్యులు ప్ర‌స్థావించారు.

ప్రతి సంవత్సరం అక్టోబర్‌ 15న ర‌ఘుప‌తి వెంక‌య్య‌ జయంతిని... మార్చి 15న రఘుపతి వెంకయ్య వర్థంతిని ఘనంగా జరుపుతామని ర‌ఘుప‌తి వెంక‌య్య నాయుడు కమిటీ సభ్యులు తెలిపారు. ఇక ప‌రిశ్ర‌మ‌కు అంకిత‌మైన ప‌ని చేసిన ఎంద‌రో మ‌హానుభావుల పేర్లు గుర్తుకొచ్చేలా స్మ‌రించుకునేలా ఇంకేదైనా.. ఒక చ‌క్క‌ని కార్య‌క్ర‌మాన్ని సినీప‌రిశ్ర‌మ చేస్తే బావుండేది. అలాగే మూవీ ఆర్టిస్టుల సొంత భ‌వంతి నిర్మాణం స‌హా ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప‌లు శాఖ‌ల‌కు సొంత భ‌వంతుల నిర్మాణం కోసం ఫండ్ రైజింగ్ వంటివి చేప‌డితే మంచిదే. అలాగే మా అసోసియేష‌న్ క్లాసిక్ డేస్ స్టార్ల‌ను స‌న్మానించుకునేది. క‌నీసం దానిని తిరిగి రిపీట్ చేస్తే బావుంటుందేమో!

కేవ‌లం ర‌ఘుప‌తి వెంక‌య్య‌.. దాస‌రి విగ్ర‌హాల్ని ఆవిష్క‌రిస్తే స‌రిపోతుందా?  ఇండ‌స్ట్రీ లెజెండ్స్ సావిత్రి- రాజ‌నాల‌- రేలంగి వంటి ఎంద‌రో ప్ర‌ముఖులు ఉన్నారు. వారికి సంబంధించిన విగ్ర‌హ సంప‌ద గ‌త చ‌రిత్ర‌ను గుర్తు చేస్తుంది. అలాంటి ప్ర‌య‌త్నం ఏదైనా చేస్తే బావుండేద‌న్న ఆవేద‌న ప‌రిశ్ర‌మ‌లో వ్య‌క్త‌మ‌వుతోంది.



Tags:    

Similar News