కన్నడ నటి రాగిణి ద్వివేది తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం. నాని సరసన జెండా పై కపిరాజు చిత్రంలో నటించింది. అంతకంటే ముందే తమిళ పరిశ్రమకి రాగిణి సుపరిచితం. 'అమ్మ' అనే బహుభాషా చిత్రంలో తమిళనాడు సీఎం జయలలిత క్యారెక్టర్ లో నటించి సంచలనం సృష్టించింది. ఇటీవలే నాని జెండా పై కపిరాజు సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది ఈ బొద్దుగుమ్మ.
అయితే ఇటీవలే అనూహ్యంగా యాక్సిడెంట్ కి గురై ఆస్పత్రిపాలైంది. కన్నడ సినిమా నానే నెక్స్ట్ సీఎం షూటింగులో ఉన్నప్పుడు ఫైటర్ విసిరిన హాకీ స్టిక్ తలకి తగిలి బలమైన గాయం అయ్యింది. దాంతో హుటాహుటీన సమీపంలోని ఆస్పత్రికి తరళించి చికిత్స అందించారు. రాగిణి సేఫ్ ఇప్పుడు. డాక్టర్లు ఎలాంటి ప్రమాదం లేదని డిస్శార్జ్ చేశారు.
నేను కోలుకున్నా. తలకి దెబ్బ తగిలి రక్తం కారడంతో కాస్త కంగారు పడ్డానంతే. కానీ ఇప్పుడు బాగానే ఉన్నా. ఇక షూటింగుకి వెళ్లడమే ఆలస్యం అంటూ రాగిణి చెప్పుకొచ్చింది. వర్థమాన నటి సాధ్యమైనంత త్వరగా కోలుకుని యథావిధిగా షూటింగుల్లో పాల్గొనాలని ఆకాంక్షిద్దాం.