మూడు నెలల క్రితం డ్రగ్స్ మాఫియా కేసులో అరెస్టయి బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో విచారణ ఖైదీగా ఉన్న శాండిల్ వుడ్ బ్యూటీ రాగిణి ద్వివేది తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో.. ఆమెను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
ఫలించని బెయిల్ ప్రయత్నాలు..
డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన శాండల్ వుడ్ బ్యూటీ క్వీన్ తనకు బెయిల్ మంజూరు చెయ్యాలని బెంగళూరులోని ప్రత్యేక కోర్టును కోరుతూనే ఉంది. అయితే.. కేసు ప్రస్తుతం విచారణలో ఉందని, ఇలాంటి సమయంలో నటి రాగిణికి బెయిల్ మంజూరు చేస్తే ఆమె బయటకు వచ్చి సాక్షుల మీద ప్రభావం చూపిస్తుందని, అందువల్ల బెయిల్ ఇవ్వకూడదని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించడంతో ఆమె కోరిక నెరవేరలేదు.
ఆందోళనతో అనారోగ్యం..
కోర్టులో ఎదురు దెబ్బలతో రాగిణి ద్వివేది నిరంతర ఆందోళన చెందుతూ అనారోగ్యం బారిన పడ్డారని, ఆమె ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందడానికి అవకాశం ఇవ్వాలని ఆమె తరపు న్యాయవాదులు ఇంతకు ముందే కోర్టును కోరారు. కానీ.. న్యాయస్థానం అందుకు అంగీకరించలేదు. పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో అన్ని సదుపాయాలతో ఆసుపత్రి ఉందని, అక్కడే చికిత్స పొందవచ్చని కోర్టు సూచించింది.
బయట భోజనానికీ నో..
కాగా.. బయట నుంచి భోజనం తెప్పించుకోవడానికి నటి రాగిణి ప్రయత్నించింది. అయితే.. బయట కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండడంతో.. బయట నుంచి భోజనం తెప్పించుకోవడానికి తాము అనుమతి ఇవ్వబోమని సెంట్రల్ జైలు అధికారులు చెప్పారు.
తీవ్ర అనారోగ్యంతో..
తాజాగా నటి రాగిణి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఊపిరి ఆడకపోవడం, ఎక్కువ కడుపునొప్పి రావడంతో సెంట్రల్ జైలులోని ఆసుపత్రిలో నటి రాగిణికి చికిత్స అందించారు. అయినా.. ఆరోగ్యం కుదుట పడకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. దీంతో.. ఆమెను నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
వైద్య నివేదికే కీలకం..
ఇప్పుడు రాగిణికి బెయిల్ మంజూరవుతుందా? లేదా? అన్నది ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు ఇచ్చే నివేదిక మీదనే ఆధారపడి ఉంటుంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో రాగిణి ద్వివేదికి షరతులతో కూడిన జామీను మంజూరు చెయ్యాలని ఆమె న్యాయవాది అజ్మల్ పాషా కోర్టును ఆశ్రయించడానికి సిద్దం అయ్యారని సమాచారం. కాగా.. ఇప్పటికే ఈ డ్రగ్స్ మాఫియా కేసులో అరెస్టు అయిన మరో నటి సంజనా గల్రానీ బెయిల్ మీద బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే.. సంజనా కంటే ముందే రాగిణి ఆరెస్టు అయినా ఆమెకు మాత్రం ఇంత వరకు బెయిల్ మంజూరు కాలేదు.