కర్ణాటక సినిమా ఇండస్ట్రీని ఇప్పుడు డ్రగ్స్ కేసు ఊపేస్తోంది. ఇప్పటికే ఇద్దరు హీరోయిన్లు రాగిణి, సంజన అరెస్ట్ అయ్యారు.కాగా పరప్పన అగ్రహార జైల్లో విచారణ ఖైదీగా ఉన్న శాండిల్ వుడ్ నటి రాగిణి ద్వివేదికి తాజాగా చుక్కెదురైంది. బెయిల్ మంజూరు చేయాలంటూ నటి రాగిణి పెట్టుకున్న బెయిల్ పిటీషన్ ను కోర్టు తోసిపుచ్చింది.
రాగిణికి బెయిల్ రాకపోవడంతో సెంట్రల్ జైల్లో కన్నీరు పెట్టుకుందని జైలు వర్గాలు తెలిపాయి. బోరున ఏడ్చిందని అంటున్నారు.
డ్రగ్స్ కేసు విచారణలో ఉందని.. ఇలాంటి సమయంలో నటి రాగిణికి బెయిల్ మంజూరు చేస్తే ఆమె జైలు నుంచి బయటకు వచ్చి సాక్ష్యులను ప్రభావితం చేస్తుందని.. బెయిల్ ఇవ్వవద్దని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టును కోరారు. రాగిణికి బెయిల్ ఇవ్వవద్దంటూ బెంగళూరు క్రైం బ్రాంచ్ కూడా కోర్టుకు విన్నవించింది. దీంతో కోర్టు బెయిల్ నిరాకరించి ఈనెల 19వ తేదికి విచారణను వాయిదా వేసింది.
ఇక బెయిల్ రాలేదన్న విషయం తెలుసుకొని హీరోయిన్ రాగిణి జైల్లో బోరున ఏడ్చినట్టు తెలిసింది. 14 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా రాగిణి జైల్లోనే ఉండనుంది.
ఇక రాగిణికి అనారోగ్యం ఉందని.. ఆమెను ఆస్పత్రిలో చికిత్స పొందడానికి అనుమతించాలని న్యాయవాదులు కోరినా కోర్టు అందుకు అంగీకరించలేదు. సెంట్రల్ జైల్లోనే ఆస్పత్రి ఉందని.. అక్కడ రాగిణి చికిత్స చేయించుకోవచ్చని కోర్టు సూచించింది. ఇక బయట నుంచి భోజనం తెచ్చుకోవడానికి సైతం సెంట్రల్ జైలు అధికారులు రాగిణికి నిరాకరించారు.
దీంతో వరుస ఎదురుదెబ్బలతో రాగిణి జైల్లో గుక్కతిప్పుకోకుండా ఏడుస్తోందని సమాచారం.