చాన్నాళ్ళకు రెహ్మాన్ పనితనం కనిపించింది

Update: 2017-10-21 09:27 GMT
తమిళనాట 'మెర్సాల్' సినిమా దూసుకుపోతోంది. అయితే ఈ సినిమాలో పాటలు గతంలో విజయ్ సినిమాలోని పాటల తరహాలో పెద్దగా హిట్టవ్వలేదు. కాని ఈ సినిమాలో ఉన్న ఒక మ్యాజిక్ ఏంటంటే మాత్రం.. అది రెహ్మాన్ అందించిన మాయ అనే చెప్పాలి.

అసలు ఎప్పుడూ కెనడాలోనే ఉంటూ.. చిన్నాచితకా హాలీవుడ్ సినిమాలకు మ్యూజిక్ అందిస్తున్న ఏఆర్ రెహ్మాన్.. ఈ మధ్యన మన సినిమాలపై పెద్దగా ఫోకస్ చేయట్లేదనే చెప్పాలి. ఒకవేళ మనోడు పాటలు అందిస్తున్నా కూడా.. బ్యాగ్రౌండ్ స్కోర్ అందించడానికి మాత్రం తన స్టూడెంట్స్ తో కలసి 'కుతుబ్ ఇ క్రుపా' అంటూ బ్రాండ్ నేమ్ పెట్టుకుని.. ఆ పేరు మీదనే అందిస్తున్నాడు. ఇప్పుడు మెర్సాల్ సినిమాకు కూడా వారే నేపథ్య సంగీతం అందించారు. అయితే దాదాపు 'ఓకె బంగారం' సినిమా తరువాత మరోసారి రెహ్మాన్ బ్యాగ్రౌండ్ స్కోర్ మాయ ఇప్పుడే కనిపించింది. సినిమాకు కొత్త రేంజ్ ఎలివేషన్ రావడానికి విపరీతంగా దోహద పడింది.

నిజానికి సినిమాను చూసినోళ్లు ఎవ్వరైనా కూడా.. సినిమా ఓపెనింగ్ సీన్లో అలాగే ఇంటర్వెల్ బ్యాంగులోనూ వచ్చే సీన్లకు రెహ్మాన్ మరియు అతని ట్రూప్ కొట్టిన మ్యూజిక్ విని మతులు పోగొట్టుకోవాల్సిందే.
Tags:    

Similar News