హ్యాపీడేస్‌ లో షారూక్ ఖాన్

Update: 2017-05-13 05:35 GMT
హ్యాపీడేస్.. ఓ పదేళ్ల క్రితం టాలీవుడ్ లో సెన్సేషన్ సృష్టించిన మూవీ. అందరూ కొత్త వాళ్లతో సినిమా తీసి సంచలనం సృష్టించాడు దర్శకుడు శేఖర్ కమ్ముల. నలుగురు కుర్రాళ్ల చుట్టూ తిరిగే ఈ సినిమాలో టైసన్ పాత్రతో రాహుల్ ఏ స్థాయిలో ఆకట్టుకున్నాడో చూశాం. అయితే.. ఆ పాత్ర విషయంలో పొగరు చూపించాడట రాహుల్. కాకపోతే అప్పటికి మెచ్యూరిటీ లేకపోవడంతోనే అని చెప్పాడు.

'నన్ను మొదట నిఖిల్ రోల్ కోసం సెలెక్ట్ చేశారు. కుచ్ కుచ్ హోతాహై మూవీలో షారూక్ ఖాన్ బాడీ లాంగ్వేజ్ ను అడాప్ట్ చేసుకోమన్నారు. కానీ ఆ తర్వాత టైసన్ పాత్ర చేయమన్నారు. స్క్రిప్ట్ తెలియక ఏదో కమెడియన్ రోల్ అనుకున్నా. అప్పుడు నాకు ఈ సినిమా ఇవ్వడమే ఎక్కువ. ఇలాంటి మైండ్ సెట్ తో ఉంటే సినిమా పాడవుతుందని కో ప్రొడ్యూసర్ అనీష్ అన్నారు. ఈ పాత్రకు చాలామందినే ఆడిషన్స్ చేశామన్నారు. ఓ పది నిమిషాలు ఆలోచించుకుని సినిమా చేయాలా వద్దా అని డిసైడ్ చేసుకోమన్నారు. కానీ నేను వెంటనే సైన్ చేసేస్తున్నట్లు చెప్పాను' అన్నాడు రాహుల్.

రాహుల్ చెబుతున్న మాటలను బట్టి చూస్తే.. హ్యాపీడేస్ మూవీలో నిఖిల్ చేసిన రాజేష్ పాత్రకు స్ఫూర్తి కుచ్ కుచ్ హోతాహై మూవీలో షారూక్ ఖాన్ అన్నమాట. శేఖర్ కమ్ముల లాంటి దర్శకుడు ఓ కేరక్టరైజేషన్ ఇలా తీసేసుకోవడం ఆశ్చర్యకరమే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News