చేసింది తక్కువ సినిమాలే అయినా తెలంగాణ యాసలో నటిస్తూ మంచి క్రేజ్ అయితే తెచ్చుకున్నాడు రాహుల్ రామకృష్ణ. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన సైన్మ అనే ఒక షార్ట్ ఫిలిం ద్వారా నటుడిగా అరంగేట్రం చేసిన రాహుల్ రామకృష్ణ... తర్వాత జయమ్ము నిశ్చయమురా, అర్జున్ రెడ్డి వంటి సినిమాలతో మంచి క్రేజ్ దక్కించుకున్నాడు. అర్జున్ రెడ్డి సినిమాలో శివ పాత్ర ద్వారా అందరికీ పరిచయం అయిన రాహుల్ రామకృష్ణ తర్వాత భరత్ అనే నేను, సమ్మోహనం, గీతగోవిందం, హుషారు, మిఠాయి, అలవైకుంఠపురంలో, పాగల్, నెట్, ఆర్ఆర్ఆర్, విరాటపర్వం, అంటే సుందరానికి వంటి సినిమాలతో మంచి ఫామ్ లో ఉన్నాడు.
అయితే ఒకపక్క సినిమాల్లో నటిస్తూనే మరోపక్కతే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రాహుల్ రామకృష్ణ ఎక్కువగా వివాదాస్పద పోస్టులు షేర్ చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటాడు. ఎప్పటికప్పుడు వివిధ వివాదాస్పద పోస్టులు షేర్ చేస్తూ అందరికీ టార్గెట్ గా మారుతూ ఉంటాడు. ఆ మధ్యన తాను పెళ్లి చేసుకోబోయే తన కాబోయే భార్య ఈమే అంటూ ఒక అమ్మాయితో కలిసి ఫోటో షేర్ చేయడంతో ఆమె గురించి రకరకాల కథనాలు పుట్టుకొచ్చాయి. ఆమె పేరు బిందు అని ఒక సాప్ట్ వేర్ ఇంజనీర్ అని ఇలా రకరకాల కథనాలు పుట్టుకు రావడంతో అసలు ఆమె పేరు బిందు కాదని ఆమె పేరు హరిత అని రాహుల్ రామకృష్ణ చెప్పుకొచ్చాడు.
ఈ మధ్యనే తాను తండ్రి కాబోతున్నానని అందరికీ తెలిసేలా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన రాహుల్ రామకృష్ణ ఇప్పుడు సంక్రాంతికి తనకు కొడుకు పుట్టాడని సంక్రాంతికి వాడు రిలీజ్ అయ్యాడు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది. అలా రాహుల్ రామకృష్ణ తండ్రి అయిపోయా అంటూ పోస్ట్ పెట్టాడు కానీ ఆయన వివాహం చేసుకున్నారనే విషయం మీద క్లారిటీ లేదు. త్వరలోనే వివాహం చేసుకునే అవకాశం ఉందని గత ఏడాది రాహుల్ రామకృష్ణ ప్రకటించారు కానీ...
ఆయన వివాహం జరిగిందా లేదా అనే విషయం మీద మాత్రం క్లారిటీ లేదు. వికీపీడియాలో సైతం రాహుల్ రామకృష్ణ ప్రస్తుతానికి సింగిల్ అనే చూపిస్తోంది. మరి వీరి వివాహానికి సంబంధించి రాహుల్ రామకృష్ణ క్లారిటీ ఇస్తే కానీ తప్ప ప్రచారాలు ఆగవు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.