నాగార్జున నటించిన తాజా చిత్రం మన్మధుడు 2. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయిక. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. ఈ శుక్రవారం సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో జరిగిన ఇంటర్వ్యూలో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ కి ఇదే ప్రశ్న ఎదురైంది. `మన్మధుడు 2` డబుల్ మీనింగ్ డైలాగులు ఘాటైన రొమాన్స్ గురించి ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారంతా. డైలాగులపై విమర్శలొస్తున్నాయి కదా? అన్న ప్రశ్నకు అసలు తాను ఇలా అవుతుందని ఊహించలేదని అన్నారు.
సింగిల్ మీనింగ్ అని రాసుకున్న డైలాగులకు ఇలాంటి స్పందన వస్తుందని ఊహించలేదని రాహుల్ అన్నారు. టీజర్ రిలీజయ్యేకే ఈ డైలాగులకు డబుల్ మీనింగ్ ఉందని అర్థమైంది. కథానాయకుడి లేట్ ఏజ్ మ్యారేజ్ ని ప్రస్థావిస్తూ మేం రాసుకున్న డైలాగులపై ఎక్కువగా జనం స్పందించారు. అసలు ఆ డైలాగ్ రాసేప్పుడు ఇది ఊహించనే లేదు అని అన్నారు. ప్రతిదీ ఫన్నీగా ఉండాలనే రాసుకున్న డైలాగ్. అయినా అక్కడక్కడా మాత్రమే ఇలాంటి డైలాగ్స్ ఉంటాయి. చాలా వరకూ కుటుంబ సమేతంగా చూడదగ్గ విధంగా సన్నివేశాల్ని మలిచాం.. అని రాహుల్ తెలిపారు. వయసు గ్యాప్ కపుల్ పై ఎన్నో సినిమాలొచ్చాయి. ఇది కూడా ఆ తరహానే అని అన్నారు. ఇది నేటి ప్రపంచానికి కనెక్టివిటీ ఉన్న సినిమా అని అన్నారు.
ఇది రీమేక్ అనగానే భయపడ్డారా? అని ప్రశ్నిస్తే.. అలాంటిదేం లేదు. ఫ్రీమేక్ కాదు కదా? అని అడిగానంతే. దీనికి నాకు ముందే సమాధానం ఇచ్చారు నాగ్ సర్. అన్నపూర్ణ టీమ్ విలువల పరంగా రాజీకి రాదన్న సంగతి తెలిసిందే అని అన్నారు. ఈ స్క్రిప్టుకి సినిమాకి యాప్ట్ టైటిల్ కదా అని కొందరు సజెస్ట్ చేస్తేనే మన్మధుడు 2ని ఫైనల్ చేశాం. దీనిపై పెద్ద చర్చ కూడా సాగింది. నాగ్ సర్ కూడా ఆలోచించారు. గూగుల్.. ఐఎండీబీ వెతికినా ఒకే స్టార్ ఫోటోతో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలనే ఈ టైటిల్ ని ఎంపిక చేసుకున్నాం.. అని తెలిపారు. ఆ సినిమాతో పోలిక చూస్తారు కదా? అని పోలిస్తే కంటెంట్ ని బట్టి టైటిల్ పెట్టుకున్నాం.. ఆ సినిమాతో పోల్చాలి అని మాత్రం టైటిల్ ని పెట్టుకోలేదు. ఈ సినిమా కథ వేరు. ఒక కొత్త ప్రపంచంలోకి ఆడియెన్ ని తీసుకురాగలం అని నమ్మి తీశాం.. అని తెలిపారు.