`అందాల రాక్షసి`తో తెలుగులో తెరంగేట్రం చేసిన రాహుల్ రవీంద్రన్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అసిస్టెంట్ డైరెక్టర్ కావాలని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ చెన్నై కుర్రాడు....తాజాగా `చిలసౌ`తో దర్శకుడిగా తెరంగేట్రం చేశాడు. సుశాంత్ హీరోగా నటించిన ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకుంది. అయితే, తన చిత్రానికి మంచి టాక్ - రివ్యూలు వచ్చినా....కలెక్షన్లు మాత్రం నిరాశపరిచాయని రాహుల్ అవేదన వ్యక్తం చేస్తున్నాడు. తాజాగా, ఈ చిత్ర సక్సెస్ మీట్ లో పాల్గొన్న రాహుల్...తన మనసులో మాట వెల్లడించాడు. తన సినిమాకు క్రిటిక్స్ అందరూ మంచి రివ్యూలిచ్చారని....తొలి ప్రయత్నంలోనే మంచి సినిమా తెరకెక్కించినందుకు ప్రశంసించారని అన్నాడు. కానీ, కలెక్షన్లు మాత్రం నిరాశపరచాయన్నాడు.
వాస్తవానికి - సింపుల్ కథను చాలా ఎఫెక్టివ్ గా చెప్పడంలో రాహుల్ సక్సెస్ అయ్యాడు. అటువంటి కథను డెబ్యు డైరెక్టర్ టేకప్ చేసిన విధానానికి ప్రశంసలు కూడా దక్కాయి. ఈ చిత్రానికి సంబంధించి నెగెటివ్ అంశాలు కూడా పెద్దగా లేదు. అలా అని ఇదో అద్భుతమైన సినిమా అనే టాక్ రాలేదు. మంచి టాక్ వచ్చిన ఈ సినిమా...యూఎస్ ఏలోనైనా వసూళ్లు రాబడుతుందని రాహుల్ అనుకున్నాడట. అయితే, అక్కడ కూడా కలెక్షన్ల పరంగా భారత్ లోని పరిస్థితే ఎదురైంది. దీంతో, రాహుల్...తన తొలి సక్సెస్ ను ఎంజాయ్ చేయలేకపోతున్నాడు. అయితే, కథ సాగతీత ధోరణిలో కాకుండా వేరే ఫామ్ లో ఉన్న హీరోతో అయితే, ఈ చిత్రానికి మంచి వసూళ్లు వచ్చేవని ట్రేడ్ విశ్లేషకుల అంచనా. ఏది ఏమైనా...అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా తయారైంది రాహుల్ రవీంద్రన్ పరిస్థితి.