తుపాకీ సర్వే... బిగ్ బాస్ విన్నర్ ఎవరో తేలిపోయింది

Update: 2019-11-02 17:10 GMT
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న రియాలిటీ షో బిగ్ బాస్-3 తుది దశకు చేరుకుంది. ఫైనల్ ఎపిసోడ్ రేపు (ఆదివారం రాత్రి) ప్రసారం కానుంది. తెలుగు ప్రజలందరినీ టీవీ తెరలకు కట్టిపడేసిన ఈ షోలో విజేత ఎవరన్న విషయం కూడా రేపు తేలిపోనుంది. వంద రోజులుగా ప్రసారమవుతున్న ఈ షోలో అంతకంతకూ ఆసక్తి రేకెత్తిస్తూ ముందుకు సాగుతోంది. ప్రతి వీకెండ్ లో మరింత ఉత్కంఠ రేపుతున్న ఈ షోలో ఇప్పటికే ఐదుగురు మినహా మిగిలిన కన్టెస్టెంట్ లంతా ఎలిమినేట్ కాగా... టైటిల్ పోరులో ఐదుగురే మిగిలారు. ఈ ఐదుగురిలోనూ విన్నర్ ఎవరన్న విషయం తేలిపోయే సమయం కూడా వచ్చేసింది. ఇలాంటి కీలక సమయంలో విన్నర్ ఎవరన్న విషయంపై ఒక్కొక్కరూ ఒక్కో రకంగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఆయా మీడియా సంస్థలు కూడా తమదైన రీతిలో విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఆ క్రమంలోనే తుపాకీ.కామ్ కూడా దీనిపై ఓ ప్రత్యేక సర్వే చేయించింది. పకడ్బండీగా నిర్వహించిన ఈ సర్వేలో విజేతగా రాహుల్ సిప్లిగంజ్ నిలవనున్నట్లుగా తేలింది. శ్రీముఖికి రన్నరప్ ప్లేస్ దక్కింది. తుపాకీ నిర్వహించిన సర్వేలో మెజారిటీ జనం రాహుల్ కు ఓటేయగా ... అతడి తర్వాతి ప్లేస్ లో శ్రీముఖికి అత్యధిక మంది పాఠకులు ఓటేశారు. శ్రీముఖి - రాహుల్ తో పాటు మిగిలిన హౌజ్ మేట్లకు కూడా తుపాకీ పాఠకులు వేసిన ఓట్లు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

తుపాకీ సర్వే ప్రకారం... టాప్ లో నిలిచిన రాహుల్ సిప్లిగంజ్ కు  31,243 ఓట్లు పోలయ్యాయి. రాహుల్ తర్వాతి ప్లేస్ లో ఉన్న శ్రీముఖికి 29,726 ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత  వరుణ్ సందేశ్ కు 24,162 ఓట్లు, బాబా భాస్కర్ కు 23,551 ఓట్లు వచ్చాయి. చివరి స్థానంలో నిలిచిన అలీ రెజాకు 3,243 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే... తుపాకీ ఆన్ లైన్ సర్వేలో రాహుల్ కు 27.90 శాతం ఓట్లు నమోదు కాగా... శ్రీముఖికి 26.56 శాతం, వరుణ్ సందేశ్ కు 21.59 శాతం, బాబా భాస్కర్ కు 21.04 శాతం, అలీ రెజాకు 2.90 శాతం ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా తుపాకీ సర్వేలో టాప్ ప్లేస్ రాహుల్ సిప్లిగంజ్ నిలవగా... శ్రీముఖికీ సెకండ్ ప్లేస్ దక్కింది. తుపాకీ సర్వేలో వచ్చిన ఫలితాల మాదిరే... స్టార్ మా టీవీ పోల్ లోనూ రాహుల్ కే అత్యధిక ఓటింగ్ వచ్చిందట. ఈ నేపథ్యంలోనే తుది ఎపిసోడ్ షూటింగ్ కు సంబంధించి లీకైన వివరాల ప్రకారం రాహుల్ సిప్లిగంజ్ విజేతగా నిలిచినట్లు సమాచారం. ఇప్పటికే తుది ఎపిసోడ్ కు సంబంధించి కొంత మేర షూటింగ్ జగరగా... మిగిలిన పార్ట్ రేపు (ఆదివారం) ఉదయం పూర్తి కానుందట. ఈ షోలో రాహుల్ సిప్లిగంజ్ తన ఆదిపత్యాన్ని కనబరచి విన్నర్ గా నిలవనున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News