శాలువాలు అమ్మే రాజ్ కుంద్రా.. శిల్పాషెట్టిని ఎలా పడేశాడు?

Update: 2021-07-23 06:33 GMT
అశ్లీల వీడియోల చిత్రీకరణతో అరెస్ట్ అయిన రాజ్ కుంద్రా వ్యవహారాలు ఒక్కొక్కటిగా జాతీయ మీడియాలో హోరెత్తుతున్నాయి. వెబ్ సిరీస్ అవకాశాల పేరుతో యువతులకు గాలం వేసి వాళ్లతో అశ్లీల చిత్రాలు తీస్తున్నాడన్న ఆరోపణలపై రాజ్ కుంద్రాను సోమవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ వ్యవహారంపై సీరియస్ గా విచారణ జరుపుతున్న  ముంబై పోలీసులు ఇప్పటిదాకా ఆసక్తికరమైన సమాచారాన్ని సేకరించినట్టు తెలుస్తోంది.

రాజ్ కుంద్రా అరెస్ట్ తర్వాత పలువురు బాలీవుడ్ కు చెందిన మోడల్స్ బయటకు వచ్చి అతడిపై ఆరోపణలు చేస్తున్నారు. అలాగే ఈ అశ్లీల చిత్రాల దందాకు సంబంధించిన వాట్సాప్ చాట్ కూడా బయటకు రావడంతో మరికొంత మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.హాట్ షాట్స్, హాట్ హిట్ మూవీస్ లాంటి బీ, సీ గ్రేడ్ యాప్స్ కొన్నింటిలో అశ్లీల చిత్రాలను అప్ లోడ్ చేస్తున్నారని పోలీసులు తేల్చారు.

ఈ క్రమంలోనే ఇన్ని రోజులు బిజినెస్ మ్యాన్ గా చలామణి అవుతూ వస్తున్న రాజ్ కుంద్రా.. ఏకంగా బాలీవుడ్ బ్యూటీ శిల్పాషెట్టిని ఎలా వలలో వేసుకున్నాడు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

నిజానికి రాజ్ కుంద్రాకు శిల్పాషెట్టి రెండో భార్య. మొదటి భార్య నుంచి విడిపోయిన రాజ్ కుంద్రా రెండో భార్యగా శిల్పాశెట్టిని చేసుకున్నాడు. మొదటి భార్యకు ఆమె బావతో వివాహేతర సంబంధం ఉండడంతోనే ఆమె నుంచి విడిపోయినట్లు చెబుతున్నాడు.

రాజ్ కుంద్రా ఫ్యామిలీ చిన్నప్పుడే లండన్ కు వలస వెళ్లింది. ఆ తర్వాత 18 ఏళ్ల వయసులో రాజ్ కుంద్రా నేపాల్ కు వచ్చి అక్కడ శాలువాల బిజినెస్ మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే కోట్లు సంపాదించాడు. 2007 దుబాయ్ కు వెళ్లి అక్కడ కన్ స్ట్రక్షన్ ట్రేడింగ్ మొదలుపెట్టి బాగా సంపాదించాడు. ఆ తర్వాత 2009 లో నటి శిల్పాశెట్టిని వివాహం చేసుకున్నాడు.

ఇక శిల్సాశెట్టిని ఫ్రెండ్ ద్వారా పరిచయం చేసుకున్నాక ఆమె అందాని ఫిదా అయ్యి రోజూ ఒక ఖరీదైన గిఫ్ట్ పంపించడం మొదలు పెట్టాడట.. ఆ తర్వాత అత్యంత ఖరీదైన బ్యాగ్ ను ఎంపిక చేసి ఆమెకు ఏ కలర్ నచ్చుతుందో తెలియక మూడు గిఫ్ట్ లు రాజ్ కుంద్రా పంపించాడట.. అలా ఇంప్రెస్ అయిన శిల్పా శెట్టి చివరకు అతడిని పెళ్లి చేసుకునేందుకు ఓకే చెప్పింది. అలా వీరిద్దరూ ఒక్కటైనట్టు శిల్పాశెట్టి ఒక వీడియోలో చెప్పుకొచ్చింది
Tags:    

Similar News