యంగ్ హీరో రాజ్ తరణ్ కెరీర్ లో కుమారి 21ఎఫ్ ను ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వరుస హిట్స్ సాధిస్తున్న ఈ కుర్రాడికి బ్లాక్ బస్టర్ ను అందించి.. ఊపు మీదకు తీసుకొచ్చన మూవీ ఇది. సుకుమార్ రైటింగ్స్ లో తెరకెక్కిన ఈ చిత్రం ద్వారా అటు రాజ్ తరుణ్.. ఇటు హీరోయిన్ హెబ్బా పటేల్ ఫుల్ బిజీ అయిపోయారు.
కుమారి 21 ఎఫ్ రూపొందించిన దర్శకుడు పల్నాటి సూర్యప్రతాప్.. ఇప్పుడు మరో సినిమాకు సిద్ధమవుతున్నాడు. ఓ అందమైన ప్రేమకథను సిద్ధం చేసుకున్న ఈ డైరెక్టర్.. రీసెంట్ గా నిర్మాత తాళ్లూరిని కలిసి కథ వినిపించగా.. వెంటనే ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సిద్ధమయ్యాడట ఈ ప్రొడ్యూసర్. స్టోరీ లైన్ ప్రకారం రాజ్ తరుణ్ అయితే ఈ కథకు పర్ఫెక్ట్ అని ఫిక్స్ అయి.. అప్రోచ్ కాగా ఈ యంగ్ హీరో నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందట. అలా తనకు బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడితో మరో చిత్రానికి రెడీ అయిపోయాడు రాజ్ తరుణ్.
ప్రస్తుతం రాజుగాడు.. లవర్ చిత్రాలను చేస్తున్న రాజ్ తరుణ్.. ఈ సినిమాల షూటింగ్ ను చివరి దశకు తెచ్చేశాడు. త్వరలోనే రిలీజ్ అయిపోనున్నాయి కూడా. త్వరలోనే పల్నాటి సూర్యప్రతాప్ తో సినిమాను అనౌన్స్ చేసి.. జనవరి చివరి నుంచి మూవీ ప్రారంభించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు నిర్మాత రామ్ తాళ్లూరి.. ప్రస్తుతం రవితేజ- కళ్యాణ్ కృష్ణ కాంబినేషన్ లో ఓ సినిమాను రూపొందించనున్నాడు.