రంగుల రాట్నంతో హర్టయ్యాడట

Update: 2018-01-25 10:45 GMT
ఒక సినిమా బావుంటే జనాలు చూస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమా చూసిన వాళ్లు హిట్ అని చెబుతారు ఒకే. కానీ ఒక్కోసారి కలెక్షన్స్ ఎక్కువగా అందవు అని న్యూస్ లు వస్తాయి. ఫైనల్ గా కలెక్షన్స్ పరంగా సినిమా డిజాస్టర్ అనే టాక్ ను సొంతం చేసుకుంటుంది. దీంతో నెక్స్ట్ సినిమా మార్కెట్ పై ఎంతో కొంత ఎఫెక్ట్ పడుతుంది. ఇలా జరగడానికి కారణం ప్రమోషన్స్. అయితే ఇప్పుడు అదే పరిస్థితిలో రాజ్ తరుణ్ కూడా ఉన్నాడు.

రాజ్ తరుణ్ గత కొంత కాలంగా సరైన హిట్ కోసం చాలానే ట్రై చేస్తున్నాడు. అయితే ఈ సంక్రాంతికి అన్నపూర్ణ ప్రొడక్షన్ లో నాగార్జున నిర్మించిన రంగుల రాట్నం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రివ్యూలా పరంగా సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. కానీ ప్రమోషన్స్ ని చిత్ర యూనిట్ ఏ స్థాయిలో హైలెట్ చేయలేకపోయింది. ముఖ్యంగా తనకు సంబందించిన ప్రతి సినిమా ప్రమోషన్స్ లో ఉండే నాగార్జున ఈ సారి మాత్రం ఎక్కువగా చేయలేదు.

దీంతో రాజ్ తరుణ చాలా నిరాశ చెందాడని తెలుస్తోంది. సంక్రాంతి మూమెంట్ లో పెద్ద సినిమాల ఎఫెక్ట్ ఏమి లేకపోయినా ఈ సినిమా వైపు ఎవరు పెద్దగా చూడలేదు. ప్రొడక్షన్ టీమ్ లో ప్లానింగ్స్ లేకపోవడం వల్లే ప్రమోషన్స్ పెద్దగా క్లిక్ అవ్వలేదని ఇక నుండి ప్రొడ్యూస్ ఎంత పెద్ద వ్యక్తి అయినా కూడా రిలీజ్ డేట్ అండ్ ప్రమోషన్లు తనే చూసుకుంటాడట రాజ్ తరుణ్. ప్రస్తుతం ఈ హీరో రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు.  
Tags:    

Similar News