మొన్న శుక్రవారం నుంచి ఒక్కసారిగా అందరి ఫోకస్ ఒక్కసారిగా 'జెర్సీ' పైకి మళ్ళింది. నాని.. శ్రద్ధాల యాక్టింగ్.. గౌతమ్ బ్రిలియంట్ డైరెక్షన్.. సినిమాలో ఉన్న ఎమోషన్.. ఇవే తెలుగు సిని ప్రియుల చర్చల్లో ప్రముఖంగా చోటు చేసుకుంటున్నాయి. సాధారణ ప్రేక్షకులతో పాటుగా సెలబ్రిటీలు కూడా 'జెర్సీ'కి ఫిదా అవుతున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో క్యామియోలాంటి ఒక చిన్న పాత్రలో యువ హీరో రాజ్ తరుణ్ కు ఆఫర్ వస్తే రిజెక్ట్ చేశాడని సమాచారం.
నానికి కుమారుడిగా జస్ట్ రెండు సీన్స్ లో మాత్రమే నటించాల్సిన పాత్ర అది. సినిమా ప్రారంభంలోనూ.. క్లైమాక్స్ లో ఆ సీన్స్ ఉంటాయి. సినిమాలో మంచి ఇంపాక్ట్ ఉండే సన్నివేశాలే అవి. కానీ రాజ్ తరుణ్ మాత్రం క్యామియోలో నటించదలుచుకోలేదట. కారణం ఏంటంటే.. రాజ్ తరుణ్ కెరీర్ ప్రస్తుతం డౌన్ లో ఉంది. ఈ సమయంలో ఇలాంటి చిన్న పాత్రలు యాక్సెప్ట్ చేస్తే తన కెరీర్ పై ప్రతికూల ప్రభావం చూపిస్తుందేమోనని సందేహించాడట. ఇక తనకు అలాంటి అతిథి పాత్రలే ఆఫర్ చేస్తారమోనని ఆలోచనతో ఈ 'జెర్సీ' ఆఫర్ ను తిరస్కరించాడట.
నాని నాన్నగా.. రాజ్ తరుణ్ తనయుడిగా.. ఆలోచిస్తేనే కాంబినేషన్ ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా! కారణాలేవైనా ఒక సూపర్ హిట్ సినిమాలో భాగమయ్యే అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు రాజ్ తరుణ్. అలా అయినా తన కెరీర్ కు కాస్త లక్ తగిలేదేమో.