స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు జడ్జిమెంట్ గురించి.. ఆయన బిజినెస్ స్కిల్స్ గురించి ఇండస్ట్రీలో చాలామంది గొప్పగా చెప్తూ ఉంటారు. అయితే ఈమధ్య కాలంలో మాత్రం మునుపటి స్పీడ్ తగ్గిన మాట వాస్తవం. నిర్మించిన సినిమాలే కాకుండా డిస్ట్రిబ్యూషన్ లో కూడా రాజుగారికి ఫెయిల్యూర్లు ఎదురవుతున్నాయి. ఇక కొన్ని విషయాల్లో రాజుగారి నిర్ణయాలు కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. అందులో ఒకటి రాజ్ తరుణ్ తో వరసగా సినిమాలు చేయడం.
యవ హీరో రాజ్ తరుణ్ మొదట్లో వరస హిట్లతో మంచి జోరు మీద ఉండేవాడు కానీ తర్వాత మాత్రం ఫ్లాపులతో కెరీర్లో స్లో అయ్యాడు. దిల్ రాజు బ్యానర్ లో రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కిన 'లవర్' జులై 2018 న రిలీజ్ అయింది. అనీష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా ఫస్ట్ షో నుంచి ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. రాజుగారు కూడా ప్రమోషన్స్ చేయకుండా ఆ సినిమాను వదిలేయడంతో అది కాస్తా డిజాస్టర్ గా నిలిచింది. ఆ సినిమా రాజ్ తరుణ్ కెరీర్ పై తీవ్ర ప్రభావం చూపిందనుకోవాలి. రాజ్ తరుణ్ ఆ ఫ్లాప్ దెబ్బకు కొంత గ్యాప్ కూడా తీసుకున్నాడు. అయితే అదేమీ పట్టించుకోకుండా రాజుగారు మరో సినిమా 'ఇద్దరి లోకం ఒకటే' ను రాజ్ తరుణ్ తో నిర్మించారు. జీఆర్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 25 వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రానుంది.
అంత ఫ్లాప్ తర్వాత.. అదీ దాదాపుగా ఫేడ్ అవుట్ అయ్యాడు అనే స్టేజికి వెళ్ళిన హీరోకు దిల్ రాజు ఎందుకు ఛాన్స్ ఇచ్చారు అంటే.. రాజ్ తరుణ్ తో రాజుగారు 3 సినిమాల కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారట. అందుకే హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా రాజ్ తరుణ్ తో సినిమాలు నిర్మించాల్సి వస్తోంది. ఇదొక్కటే కారణం కాదట. రాజు గారి కింద చాలా థియేటర్లు ఉన్నాయి కదా.. వాటిలో ప్రదర్శించేందుకు అయినా ఏదో ఒక సినిమా అయితే కావాలి కదా. సొంత సినిమాలు అయితే మేలనేది కూడా మరో ఉద్దేశమట. ఇదిలా ఉంటే రాజ్ తరుణ్ సినిమాలు ప్రస్తుతం రెండు సెట్స్ మీద ఉంటే రెండు డిసెంబర్ లోనే రిలీజ్ కావాల్సి ఉందట. కానీ రాజుగారి నిర్మాణంలో తెరకెక్కిన 'ఇద్దరి లోకం ఒకటే' సినిమాను మొదట డిసెంబర్ లో రిలీజ్ చేసి ఆ తర్వాత ఒక నెల గ్యాప్ లో మరో సినిమాను సినిమా ను ప్లాన్ చేస్తున్నారట.