ఓ ప్రముఖ కథానాయకుడికి చెందిన మూడు సినిమాలు 50 రోజుల వ్యవధిలో విడుదల కావడం.. ఆ మూడు సినిమాలకూ మంచి క్రేజ్ నెలకొనడం అరుదుగా జరుగుతుంటుంది. మన యువ కథానాయకుల్లో నారా రోహిత్ మాత్రమే ఈ ఘనత సాధించబోతున్నాడు. ఆల్రెడీ పది రోజుల కిందట రోహిత్ ‘తుంటరి’గా జనాల ముందుకొచ్చాడు. ఆ సినిమాకు జనాల నుంచి మంచి రెస్పాన్సే వచ్చింది. పరీక్షల సీజన్లోనూ పెట్టుబడి వెనక్కి తేగలిగింది ఈ సినిమా. ఇంకో పది రోజుల్లో రోహిత్ ‘సావిత్రి’తో జనాల్ని పలకరించబోతున్నాడు. ‘ప్రేమ ఇష్క్ కాదల్’ ఫేమ్ పవన్ సాధినేని దర్శకత్వం వహించిన ఈ సినిమా రోహిత్ కెరీర్ లోనే అత్యంత భారీగా, బంపర్ క్రేజ్ మధ్య రిలీజవ్వబోతోంది. టీజర్ రిలీజైనప్పటి నుంచి దీని మీద పాజిటివ్ బజ్ ఉంది జనాల్లో.
ఈ సినిమా సందడి ముగిసే లోపే రోహిత్ ఇంకో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రోహిత్ కొత్త సినిమా ‘రాజా చెయ్యి వేస్తే కూడా ఏప్రిల్ నెలాఖరులోనే రిలీజవుతుందని సమాచారం. ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించడం.. నందమూరి తారకరత్న విలన్ పాత్ర పోషించడం.. రోహిత్ సరికొత్త లుక్ లో దర్శనమిస్తుండటం.. టీజర్ కూడా అదిరిపోవడంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆడియో టీజర్ తర్వాత ఈ సినిమా టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయిపోయింది. ఈ శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు - నందమూరి బాలకృష్ణల చేతుల మీదుగా భారీ లెవెల్లో ఆడియో రిలీజ్ కార్యక్రమం కూడా ప్లాన్ చేశారు. ఆడియో రిలీజయ్యాక సినిమా గురించి మరింతగా చర్చ జరిగే అవకాశముంది. ఫుల్ పాజిటివ్ బజ్ ఉన్న నేపథ్యంలో ఆలస్యం చేయకుండా సమ్మర్ సీజన్ లో మంచి డేటు చూసి రిలీజ్ చేసేద్దామని చూస్తున్నాడు సాయికొర్రపాటి. ఈ సినిమా ఏప్రిల్లోనే రిలీజైతే.. 50 రోజుల్లో మూడు సినిమాలు రిలీజ్ చేసిన అరుదైన హీరో అవుతాడు రోహిత్.