కాస్త ఆలస్యమైనా రాజా రాజ కూడా వచ్చేస్తున్నాడు

Update: 2021-09-24 15:30 GMT
కరోనా సెకండ్‌ వేవ్ తర్వాత విడుదల అయిన సినిమాలు రెండు మూడు వారాలు మాత్రమే థియేటర్లలో ఆడాయి. కొన్ని సినిమాలు కనీసం రెండు వారాలు కూడా థియేటర్లలో ఉండలేదు. సినిమాలు సక్సెస్ టాక్‌ వచ్చినా కూడా కరోనా కారణంగా థియేటర్లలో ఎక్కువ వసూళ్లను నమోదు చేయలేక పోయింది. అందుకే దాదాపు అన్ని సినిమాలను కూడా వెంటనే ఓటీటీ ద్వారా విడుదల చేయడం జరిగింది. రెండు మూడు వారాల్లో కూడా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలు ఉన్నాయి. కొన్ని కాస్త ఆలస్యం అయినా కూడా మొత్తంగా నెల లోనే ఓటీటీ లోకి సినిమాలు వచ్చేశాయి. కాని ఆగస్టు మూడవ వారంలో విడుదల అయిన రాజ రాజ చోర సినిమా మాత్రం ఓటీటీ విడుదల ఆలస్యం అవుతూ వచ్చింది.

సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.. కాని జనాలు థియేటర్లకు వెళ్లి చూసేందుకు ఆసక్తి చూపించలేదు. ఓటీటీ లో వస్తుంది కదా అప్పుడు చూద్దాం అన్నట్లుగా చాలా మంది వెయిట్‌ చేశారు. తీరా వెయిట్‌ చేసిన ప్రేక్షకులకు షాక్ ఇచ్చినట్లుగా నెల దాటినా కూడా ఓటీటీ లో రాకపోవడంతో ఎదురు చూపులు కంటిన్యూ అవుతున్నాయి. థియేటర్ లో రిలీజ్ అయిన 50 రోజుల తర్వాత అంటే అక్టోబర్‌ 8న ఓటీటీ ద్వారా స్ట్రీమింగ్ కు సిద్దం అవుతోంది. జీ 5 యాప్‌ లో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. మంచి ఎంటర్‌ టైనర్‌ గా నిలిచి రాజ రాజ చోర సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను నమోదు చేయడం వల్ల స్ట్రీమింగ్ రైట్స్ ను భారీ మొత్తంకు జీ 5 కొనుగోలు చేసినట్లుగా చెబుతున్నారు.

శ్రీ విష్ణు హీరోగా నటించిన ఈ సినిమాలో సునైన మరియు మేఘ ఆకాష్ లు హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమా కథ మొత్తం ఒక కిరీటం చుట్టు తిరుగుతూ ఉంటుంది. ఒక జీరాక్స్ షాప్ లో హెల్పర్ గా పని చేసే హీరో తాను ఒక సాఫ్ట్‌ వేర్ కంపెనీలో ఎంప్లాయిని అంటూ హీరోయిన్‌ కు చెప్తాడు. చిన్న చిన్న దొంగతనాలు చేసుకునే హీరో పెళ్లి అయినా కూడా ఆ విషయాన్ని దాచి పెడతాడు. హీరో పాత్ర చుట్టు చాలా సస్పెన్స్‌ ఉంటుంది. ఆ సస్పెన్స్ ను చివర్లో ఎలా రివీల్‌ చేస్తారు అనేది ఆసక్తికర విషయం. హసిత్‌ గొలి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మంచి ఎంటర్ టైనర్ గా నిలవడంతో పాటు శ్రీవిష్ణు కెరీర్‌ లో మంచి సినిమాగా కూడా నిలిచిందని విశ్లేషకులు రివ్యూలు ఇచ్చారు. అలాంటి సినిమా అక్టోబర్‌ 8న స్ట్రీమింగ్ కు సిద్దం అయిన నేపథ్యంలో ప్రేక్షకుల ఎదురు చూపులకు ఫుల్ స్టాప్ పడబోతుంది.
Tags:    

Similar News