వర్సటైల్ హీరో శ్రీ విష్ణు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''రాజ రాజ చోర''. హసిత్ గోలి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మేఘా ఆకాశ్ - సునయన హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ విశేషంగా ఆకట్టుకుంది. అలానే టీజర్ అప్డేట్ కోసం గంగవ్వ చేత చెప్పించిన 'చోర గాధ' కూడా సినిమాపై ఆసక్తిని పెంచేసింది. ఈ క్రమంలో తాజాగా ''రాజ రాజ చోర'' టీజర్ ను చిత్ర బృందం విడుదల చేసింది.
నిత్యానంద చెప్పే ప్రవచనంతో ప్రారంభమైన ఈ టీజర్ లో శ్రీవిష్ణు ను దొంగగా పరిచయం చేశారు. అయితే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అని చెప్పుకుంటూ.. హీరోయిన్ మేఘా ఆకాష్ తో రొమాన్స్ చేస్తున్నాడు. పగలేమో సూటు బూటు వేసుకుని సాఫ్ట్ వేర్ అని తిరుగుతూ.. రాత్రి అయితే తన చోర కళను చూపిస్తున్నాడు. ఇక ఎవరో ఒక దొంగ దొరికితే.. పట్టుకొని జైల్లో వేసి పాత కేసులన్నీ అతనిపై మోపాలని చూసే పోలీస్ ఆఫీసర్ గా రవిబాబు కనిపిస్తున్నాడు.
విభిన్నమైన కథలను ఎంపిక చేసుకుంటూ వస్తున్న శ్రీవిష్ణు.. మరోసారి ఆసక్తికరమైన సినిమాతో అలరించబోతున్నాడని టీజర్ చూస్తే అర్థం అవుతుంది. ఇందులో అతను తనదైన శైలిలో పలికే ఇంగ్లీష్ పదాలు నవ్వు తెప్పిస్తున్నాయి. ప్రతి దానికీ 'దీనికి సొల్యూషన్ చెప్పనా' అంటూ సునయన పాత్రను కూడా ఇందులో పరిచయం చేసారు. చివర్లో ఇప్పటి వరకు ప్రచార చిత్రాల్లో చూపిస్తూ వస్తున్న రాజు కిరీటాన్ని మన చోరుడు దొంగిలించి పారిపోతున్నట్లు చూపించారు.
'రాజాది రాజ.. రాజ మార్తాండ.. రాజ రాజ చోర.. బహు పరాక్.. బహు పరాక్' అంటూ వచ్చిన ఈ టీజర్ హిలేరియస్ గా ఉంది. దీనికి వివేక్ సాగర్ అందించిన నేపథ్యం సంగీతం.. వేదరామన్ సినిమాటోగ్రఫీ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. విప్లవ్ నిషాదం ఈ చిత్రానికి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రంలో తనికెళ్ళ భరణి - కాదంబరి కిరణ్ - శ్రీకాంత్ అయ్యంగార్ - అజయ్ ఘోష్ - వాసు ఇంటూరి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మరియు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టి.జి.విశ్వప్రసాద్ - అభిషేక్ అగర్వాల్ కలిసి 'రాజ రాజ చోర' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా.. కీర్తి చౌదరి క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోన్న ఈ సినిమాని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
Full View