ఊపిరి టైటిల్ వెనుక.. అదీ కథ

Update: 2016-03-18 05:19 GMT
నాగార్జున - కార్తి - తమన్నాలు నటించిన ఊపిరి మూవీ వచ్చే వారం విడుదల కాబోతోంది. ఈ మూవీ టైటిల్ వెనుక పెద్ద చీటింగ్ స్టోరీ నడించిందని తెలుస్తోంది. తమ చిత్రానికి 'ఊపిరి' అనే టైటిల్ ని ఫిక్స్ చేయాలని డిసైడ్ అయ్యాక.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఇందుకోసం ప్రయత్నించాడు. అయితే.. ఆ టైటిల్ ని అప్పటికే నటుడు రాజా రవీంద్ర రిజిస్టర్ చేయించుకున్నాడని తెలియడంతో.. అతడిని అప్రోచ్ అయ్యాడట వంశీ.

'ఊపిరి' టైటిల్ ని తమకు ఇవ్వాలని.. రాయల్టీగా సినిమాలో ఓ పోలీసాఫీసర్ పాత్రను ఇస్తాననే ప్రపోజల్ పెట్టాడట వంశీ. దీనికి సంతోషించిన రాజా రవీంద్ర.. రాయల్టీ కూడా తీసుకోకుండా.. 'ఊపిరి' టైటిల్ ఇచ్చేస్తున్నట్లు సంతకం చేసేశాడని టాక్. అయితే.. సెట్స్ కు వెళ్లినపుడు ఈ కేరక్టర్ ఆర్టిస్ట్ కి అసలు విషయం తెలిసింది. తన పాత్ర చాలా చిన్నదని, కేవలం ఒకే ఒక్క డైలాగ్ ఉండే ఈ రోల్.. ఏ జూనియర్ ఆర్టిస్ట్ తో చేయించినా సరిపోతుందని అర్ధమైందట. అయినా ఏం చేయలేక తన రోల్ చేసేసి వెళ్లిపోయాడు రాజా రవీంద్ర.

దీనికి మించిన అవమానం ఇంకొకటి కూడా జరిగింది. మూవీకి సంబంధించి ప్రాణం అయిన టైటిల్ ని ఉచితంగా ఇచ్చేసిన రాజారవీంద్రను.. ఆడియో ఫంక్షన్ కు కనీసం అహ్వానించలేదట దర్శకుడు వంశీ. వేరే పనుల్లో బిజీగా ఉండడంతో.. పిలవలేకపోయానని తర్వాత స్టోరీ అల్లేశాడు ఈ డైరక్టర్. అయినా.. పనయిపోయాక పట్టించుకుంటారా ఏంటి? అంతే కదా.
Tags:    

Similar News