బాహుబలి మూవీ దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి రేంజిని ఎక్కడికో తీసుకెళ్లింది. ఆయన మాటకు విలువ కూడా అమాంతం పెరిగిపోయింది. రాజమౌళి ఏదన్నా సినిమా చూసి బాగుందని ఒక్క మాటంటే చాలు... అది తమ సినిమాకు బ్రహ్మాండమైన ప్రమోషన్ గా దర్శక నిర్మాతలు ఫీలవుతుంటారు. రాజమౌళి కూడా వీలైనంత వరకు కొత్త సినిమాలు చూసొచ్చి తన ఒపీనియన్ సింపుల్ గానే చెబుతుంటాడు.
తాజాగా సీనియర్ హీరో రాజశేఖర్ హీరోగా విడుదలైన పి.ఎస్.వి. గరుడవేగ 126.18 ఎం మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. గుంటూరు టాకీస్ ఫేం ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో యాక్షన్ అండ్ ఇన్వెస్టిగేషన్ జోనర్ లో ఈ మూవీ తెరకెక్కింది. ఈ మూవీకి అంతటా పాజిటివ్ బజ్ వచ్చినందుకు గరుడవేగ టీంకు జక్కన్న సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలిపాడు. ఈ సినిమాకు సండేకు టిక్కెట్లు బుక్ చేసుకున్నానంటూ ట్విట్టర్ లో అప్ డేట్ కూడా పెట్టాడు. దీనికి హీరో రాజశేఖర్ తెగ ఆనందపడిపోయి థ్యాంక్స్ కూడా చెప్పాడు.
దాదాపుగా ప్రతి సినిమాకు రాజమౌళి తనదైన రివ్యూ ఇస్తూనే ఉంటాడు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాకు.. సాయి కొర్రపాటి ప్రొడ్యూస్ చేసిన సినిమాలకు మొదటి రోజే రివ్యూ ఇచ్చేస్తున్నాడు. మిగతా వాళ్లందరికీ రెండు రోజులు ఆగి చెబుతాననడం ఎంతవరకు న్యాయం. వీకెండ్ అయిపోయాక రివ్యూ ఇవ్వడం వల్ల ఎంతవరకు ప్రయోజనం ఉంటుంది. ఇదేం న్యాయం జక్కన్నా..