జక్కన్నకు తాతగా ప్రమోషన్‌?

Update: 2021-03-09 03:35 GMT
టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ఇప్పటి వరకు ఎంతో ఘన కీర్తిని దక్కించుకున్నాడు. దర్శకధీరుడు అంటూ పేరు దక్కించుకున్న రాజమౌళి ఇప్పుడు తాత అని పిలిపించుకోబోతున్నాడు. రాజమౌళి తనయుడు ఎస్ఎస్ కార్తికేయ తండ్రి కాబోతున్నాడు. 2018లో కార్తికేయ మరియు పూజా ప్రసాద్‌ ల వివాహం జరిగింది. గాయినిగా పేరు తెచ్చుకున్న పూజా ప్రసాద్ తో కార్తికేయ ప్రేమ వివాహం ఆ సమయంలో అంగరం వైభవంగా జరిగింది. కార్తికేయ పూజల జంట ఇప్పుడు తల్లిదండ్రులుగా మారబోతున్నారు.

టాలీవుడ్‌ లెజెండ్రీ ఫిల్మ్‌ మేకర్‌ వి బి రాజేంద్ర ప్రసాద్‌ మనుమరాలే పూజా ప్రసాద్‌. ఆయన కుమారుడు జగపతి బాబు సోదరుడి కుమార్తె పూజా అనే విషయం అందరికి తెల్సిందే. పెళ్లి తర్వాత కార్తికేయ మరియు పూజాలు ఎక్కువగా బయట కనిపించలేదు. కార్తికేయ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ ప్రొడక్షన్ వర్క్‌ చూసుకోవడంతో పాటు తన బిజినెస్‌ వ్యవహారాలతో బిజీగా ఉన్నాడు. రాజమౌళి ఫ్యామిలీలో త్వరలో బుజ్జి పాపాయి అడుగు పెట్టబోతున్న నేపథ్యంలో ఆ ఫ్యామిలీ మొత్తం చాలా సంతోషంగా ఉంది. ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలకు ముందే రాజమౌళి తాతగా ప్రమోషన్‌ ను దక్కించుకోబోతున్నాడని ఇండస్ట్రీ వర్గాల నుండి టాక్ వినిపిస్తుంది.
Tags:    

Similar News