బాహుబలి షూట్ ఆపేసి వస్తున్న ప్రభాస్

Update: 2016-12-19 09:31 GMT
బాహుబలి షూటింగ్ ప్రారంభం అయినప్పుడు ప్రభాస్ ఓ అగ్రిమెంట్ పై సైన్ చేశాడట. దీని ప్రకారం పబ్లిక్ ఫంక్షన్స్ కు.. మీడియా కవరేజ్ ఉన్న ఈవెంట్స్ కు హాజరు కాకూడదు. కాకపోతే దీనికి రిలాక్సేషన్ ఏంటంటే.. బాహుబలి షూటింగ్ జరుగుతున్నపుడు మాత్రం ఇలాంటి ఈవెంట్స్ కి హాజరు కాకూడదు. ఇప్పటివరకూ దీన్నే ఫాలో అయిన ప్రభాస్.. తొలిసారిగా బాహుబలి కోసం చేసిన అగ్రిమెంట్ కు తూట్లు పొడిచి.. షూటింగ్ ఆపేసి మరీ ఓ ఈవెంట్ కి హాజరు కాబోతున్నాడు.

'శివ టు వంగవీటి' అనే పేరుతో రామ్ గోపాల్ వర్మ సినీ జర్నీపై ఓ ఫంక్షన్ జరగనుంది. హైద్రాబాద్ లో జరగనున్న ఈ కార్యక్రమానికి ప్రభాస్ హాజరు కావడం ఖాయమైంది. కాకపోతే.. రాజమౌళి పర్మిషన్ తీసుకున్నాడులే. పైగా ఈ కార్యక్రమానిక రాజమౌళి కూడా అటెండ్ కానున్నాడట. రేపు జరిగే ఈ కార్యక్రమం కోసం.. టాలీవుడ్ నుంచి ఇంకా పలువురు అతిథులను ఆహ్వానించారు.

అక్కినేని నాగార్జున.. నాగచైతన్య.. పూరి జగన్నాధ్.. కృష్ణవంశీలతో పాటు వర్మతో పని చేసిన పలువురు హీరోలు టెక్నీషియన్స్ కూడా హాజరు కానున్నారట. అన్నిటికంటే పెద్ద ట్విస్ట్ ఏంటంటే.. వర్మ టు వంగవీటికి పవన్ కళ్యాణ్ కు కూడా ఆహ్వానం అందింది. వచ్చేందుకు ప్రయత్నిస్తానని పవన్ చెప్పినా.. ప్రస్తుతం ఆయన పొలాచ్చిలో ఉండడంతో.. ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలు తక్కువే అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News