ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో దర్శకుడు రాజమౌళి - నిర్మాత దేవీవీ దానయ్య సోమవారం ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. మార్చి 25న 'ఆర్.ఆర్.ఆర్' సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
సినిమా టికెట్ ధరలు - బెనిఫిట్ షోలు వంటి ఇతర అంశాలపై సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ తో RRR దర్శకనిర్మాతలు చర్చలు జరిపారని తెలుస్తోంది. రాష్ట్ర సినిమాటోగ్రపీ శాఖ మంత్రి పేర్ని నాని కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఇటీవల సినిమా టికెట్ ధరలతో పాటు మరిన్ని సంస్కరణలతో ఏపీ ప్రభుత్వం సరికొత్త జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భారీ బడ్జెట్ సినిమాలకు మొదటి 10 రోజులు టికెట్ రేట్లు పెంచుకోవచ్చని పేర్కొన్నారు.
20 శాతం షూటింగ్ ఏపీలో జరిగుండాలని కీలక మెలిక పెట్టినప్పటికీ.. మేకర్స్ రిక్వెస్ట్ చేయడంతో గత శుక్రవారం వచ్చిన 'రాధేశ్యామ్' చిత్రానికి టికెట్ మీద రూ. 25 పెంచుకోవడానికి జగన్ సర్కారు అనుమతిచ్చిందని తెలుస్తోంది.
ఈ క్రమంలో ఇప్పుడు రాజమౌళి - డీవీవీ దానయ్య ఏపీ ముఖ్యమంత్రితో భేటీ అవ్వడంతో.. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన 'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని ప్రత్యేకంగా పరిగణించమని అడిగేందుకే వెళ్లారని వార్తలు వస్తున్నాయి. మరి ఈ విన్నపాన్ని మన్నించి ప్రభుత్వం అనుమతులు జారీ చేస్తుందో లేదో చూడాలి.
ఇకపోతే ఇటీవల కాలంలో ఆంధ్రాలో సినీ ఇండస్ట్రీ అనేక సమస్యలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. వీటిని పరిష్కారించడానికి చిరంజీవితో సహా పలువురు సినీ ప్రముఖులు ఏపీ సీఎంని - మంత్రి పేర్ని నానితో భేటీ అయ్యారు. ఇందులో దర్శకుడు రాజమౌళి కూడా ఉన్నారు.
పలుమార్లు చర్చలు జరిపిన అనంతరం టాలీవుడ్ కు సానుకూలమైన జీవో ఇస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా టికెట్ రేట్లు పెంపు మరియు ఐదో షోకు అనుమతిస్తూ జీవో జారీ చేసింది. ఇందుకు జగన్ కు 'ఆర్.ఆర్.ఆర్' మేకర్స్ సోషల్ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలిపారు.
జీవో వచ్చిన తర్వాత మొదటిసారి ఇండస్ట్రీ నుంచి మొదటిసారి సీఎంతో వ్యక్తిగతంగా భేటీ అయిన రాజమౌళి - దానయ్య మరోసారి ధన్యవాదాలు తెలిపారు. అలానే 'ఆర్.ఆర్.ఆర్' సినిమా విడుదల నేపథ్యంలో అదనపు షోలకు పెర్మిషన్ కోరినట్లు తెలుస్తోంది. దీనిపై ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.