బాహుబ‌లికి శ్రీదేవి అడిగింది అంతా?

Update: 2017-05-29 05:20 GMT
అగ్ర‌శ్రేణి న‌టీన‌టుల‌కు సంబంధించిన విషయాలు.. తెర వెనుక జ‌రిగే సంప్ర‌దింపుల వివ‌రాలు పెద్ద‌గా బ‌య‌ట‌కు రావు. కానీ.. అందుకు భిన్నంగా తాజాగా వ‌చ్చిన వివ‌రాలు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మార‌ట‌మే కాదు.. కొత్త చ‌ర్చ‌కు తెర తీసింద‌ని చెప్పాలి. మంచి క‌థ కోసం ఎదురుచూస్తున్న‌ట్లుగా చెప్పే అగ్ర‌తార‌ల మాట‌ల‌కు చేత‌ల‌కు మ‌ధ్య ఉండే దూరం.. రెమ్యున‌రేష‌న్ తో పాటు.. న‌టుల కోర్కెల చిట్టాలు క‌థ‌లు క‌థ‌లుగా చెప్పుకుంటారు. కానీ.. ఎక్క‌డా అధికారికంగా ఓపెన్ అయిన సంద‌ర్భాలు త‌క్కువ‌. అందులోకి.. అగ్ర‌శ్రేణి న‌టుల విష‌యాన్ని ఎవ‌రూ.. ఎక్క‌డా ప్ర‌స్తావించ‌రు. అందుకు భిన్నంగా జ‌క్క‌న్న ఓపెన్ అయ్యారు.

తాజాగా ఆయ‌న ఇచ్చిన ఒక ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని చెప్పుకొచ్చారు. బాహుబ‌లి చిత్రానికి తొలుత శివ‌గామి పాత్ర కోసం అతిలోక సుంద‌రి శ్రీదేవిని సంప్ర‌దించ‌టం తెలిసిందే. అయితే.. ఆమెను కాకుండా త‌ర్వాత ర‌మ్య‌కృష్ణ‌కు ఆ పాత్ర ల‌భించ‌టం.. ఆ పాత్ర‌లో ఆమెను త‌ప్ప మ‌రెవ‌రినీ ఊహించుకోలేని ప‌రిస్థితి తీసుకొచ్చారు. ఇంత‌కీ శ్రీదేవిని ఎందుకు తీసుకోలేద‌న్న విష‌యాన్ని అడిగిన‌ప్పుడు జ‌క్క‌న్న నోటి నుంచి వ‌చ్చిందేమంటే..

సినిమా మార్కెట్‌ ను పెంచాల‌న్న ఉద్దేశంతో హిందీన‌టీన‌టుల్ని పెడితే బాగుంటుంద‌ని శ్రీదేవిని సంప్ర‌దించినట్లుగా రాజ‌మౌళి చెప్పారు. త‌మ అదృష్టం బాగుండి త‌మ ఆఫ‌ర్ ను ఆమె ఓకే చేయ‌లేదంటూ న‌వ్వేసిన రాజ‌మౌళి మ‌రో ప్ర‌శ్న‌కు స‌మాధానంగా.. ఆమె అడిగిన రెమ్యున‌రేష‌న్‌.. ఇత‌ర డిమాండ్ల చిట్టాను చెప్పుకొచ్చారు. రూ.8కోట్ల రెమ్యున‌రేష‌న్‌.. వ‌చ్చిన ప్ర‌తిసారీ 5 బిజినెస్ క్లాస్ టిక్కెట్లు.. బిగ్గెస్ట్ హోట‌ల్ లో 5 సూట్లు ఇలా అడిగార‌ని చెప్పారు.

అప్ప‌టికీ మాట్లాడ‌దామ‌ని అనుకున్నామ‌ని.. కానీ హిందీలో ప‌ర్సంటేజ్ అడ‌గ‌టం మాత్రం టూమ‌చ్ అన్నారు. నాట్ వ‌ర్త్ అనిపించి వ‌దిలేశామ‌ని.. ఆమె అలా అడ‌గ‌టం త‌మ అదృష్టంగా చెప్ప‌ట‌మే కాదు.. శ్రీదేవిని పెట్టుకుంటే సినిమా పోయుండేది క‌దా అంటే.. మొత్తం పోయుండేదంటూ న‌వ్వుల మ‌ధ్య చెప్పేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News