'మగధీర' సినిమా రాజమౌళిని దేశం మొత్తానికి పరిచయం చేస్తే.. 'ఈగ' అతడికి అంతర్జాతీయ స్థాయి కీర్తి తెచ్చిపెట్టింది. తెలుగు సినిమాలు పెద్దగా ఆడని తమిళనాడులో కూడా 'ఈగ' సినిమా భారీగా వసూళ్లు రాబట్టింది. ఐతే హిందీలో 'మక్కీ' పేరుతో చాలా హంగామా మధ్య విడుదల చేశారు కానీ.. అక్కడ ఆశించిన స్థాయిలో ఆడలేదు. టీవీల్లో బాగా ఆడటం వల్లే 'మక్కీ' గురించి బాలీవుడ్‌లో చర్చ జరిగింది కానీ.. థియేటర్లలో మాత్రం సినిమా అంతంతమాత్రంగానే ఆడింది. ఈ విషయంలో తాను కూడా చాలా అసంతృప్తి చెందినట్లు చెప్పాడు రాజమౌళి.
''ఈగ హిందీ డబ్బింగ్ వెర్షన్ విషయంలో తప్పు జరిగింది. ఆ సినిమాను మార్కెట్ చేసిన వాళ్ల విషయంలో మేం సంతోషంగా లేం. వాళ్లు అనుకున్నంత ప్రొఫెషనల్‌గా, ఎఫీషియెంట్‌గా చేయలేకపోయారు. ఐతే మక్కీ థియేటర్లలో బాగా ఆడకపోయినా బాలీవుడ్ ప్రముఖుల దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా గురించి అక్కడ చాలా చర్చ జరిగింది. టీవీ ఛానెళ్లలో జనాలు ఆ సినిమాను బాగా చూశారు. సినిమా మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు బాహుబలి విషయంలో అక్కడి జనాల్లో క్యూరియాసిటీ పెరగడానికి మక్కీనే కారణం. బాహుబలి విషయంలో ఎలాంటి తప్పు జరిగే అవకాశం లేదు. ఎందుకంటే ఆ ప్రాజెక్టు కరణ్ జోహార్ చేతుల్లో ఉంది. ఆయన అన్ని జాగ్రత్తలూ తీసుకుని.. పక్కా ప్లానింగ్‌తో సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. కచ్చితంగా ఈ సినిమా బాలీవుడ్‌లోనూ మంచి పేరు తెచ్చుకుంటుంది'' అని ధీమా వ్యక్తం చేశాడు రాజమౌళి.