డార్లింగుకి తాత‌లాగా చిందేశాడు!

Update: 2018-12-29 05:19 GMT
అరె చిందెయ్యి చిందెయ్యి శివ‌లింగ .. నీ ఒంట్లోన ఒగ‌రుంది రామ‌లింగ‌! .. ఈ చిందు చూశాక ఎవ‌రికైనా ఆ లెవ‌ల్లో జోష్ పుట్టుకొస్తుంది. జ‌క్క‌న్న ఇంట పెళ్లంటే మ‌జాకానా?  పైగా పుత్ర‌ర‌త్నం పెళ్లి.  నింగి అయినా నేల‌కు దిగి రావాలి.
చంద‌మామ వెంట‌ చుక్క‌లూ దిగి రావాలి. ఆకాశాన్ని అంటేలా.. అంబ‌రాన్ని తాకేలా.. అదిరిపోయే సెల‌బ్రేష‌న్ సాగుతోంది జైపూర్- దిల్లీ హైవేలో.

హైవే బ్లాక్ అయ్యేలా... న‌గ‌రం జామ్ అయ్యేలా! ఒక‌టే సంద‌డి. జైపూర్ ఫెయిర్ మౌంట్ విలాసాల హోట‌ల్లో అదిరిపోయే రేంజులో మూడు రోజుల పెళ్లి ఏర్పాట్లు చేశారు రాజ‌మౌళి. అత‌డి కుమారుడు కార్తికేయ ప్రియురాలు పూజా ప్ర‌సాద్ మెడ‌లో మూడు ముళ్లు వేసేందుకు రెడీ అవుతున్నారు. డిసెంబ‌ర్ 30 దివ్య‌మైన ముహూర్తం ఫిక్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. 28 డిసెంబ‌ర్ సాయంత్రం నుంచే 3డే సెల‌బ్రేష‌న్స్ ఘ‌నంగా ప్రారంభ‌మ‌య్యాయి.

ఈ సెల‌బ్రేష‌న్ కోసం తొలిరోజే టాలీవుడ్ బెస్ట్ సెల‌బ్రిటీలు జైపూర్ ఫెయిర్ మౌంట్‌ లో దిగిపోయారు. అక్క‌డ ఎంట్రీ లోనే జ‌క్క‌న్న‌తో క‌లిసి స్టార్లు చిందేస్తున్న వీడియోలు  నెట్టింట జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. నిన్న సాయంత్ర‌మే డార్లింగ్ ప్ర‌భాస్  రాజ‌మౌళి - కార్తికేయ బృందంతో క‌లిసి స్టెప్పులేసి అద‌ర‌గొట్టేశాడు. త‌న‌లోని సిగ్గ‌రిని కూడా ప్ర‌భాస్ లెక్క చేయ‌లేదు. తాజాగా మ‌రో వీడియో జోరుగా వైర‌ల్ అవుతోంది. ఈసారి డార్లింగుని మించి మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్  రాజ‌మౌళితో క‌లిసి స్టెప్పులేస్తున్నారు.

రామ్‌ చ‌ర‌ణ్ - జ‌క్క‌న్న ఆ చిందులేంటి?  ద‌గ్గుబాటి రానా ఆ వెన‌క ద‌రువేంటి?  ఈ జోష్ ని ఆపేదెవ‌రు? మ‌్యారేజ్‌ ఈవెంట్ ధూమ్మ‌చాలే అన్న తీరుగా సాగుతోంద‌న‌డానికి ఇంత‌కంటే సాక్ష్యం కావాలా?  కార్తికేయ పెళ్లి వేడుక‌లు.. ఫుల్ చిల్.. మూవ్‌మెంట్ లో పీక్స్ కి చేరిపోయాయి. ఈ వేడుక‌లకు ఇటు టాలీవుడ్ నుంచే కాదు, అటు బాలీవుడ్ నుంచి బిగ్ బీలు దిగుతున్నారు. ఇప్ప‌టిక సుశ్మితాసేన్ విచ్చేసింది. క‌రణ్ జోహార్ తో పాటు ప‌లువురు యువ‌హీరోలు రాజ‌మౌళి వార‌సుడి పెళ్లికి విచ్చేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

వీడియో కోసం క్లిక్ చేయండి

Full View

Tags:    

Similar News