జక్కన్న డాన్స్‌ అదరగొట్టేశాడే

Update: 2019-01-01 13:33 GMT
జక్కన్న రాజమౌళి చాలా హుందాగా ఉంటారు - ఆయన మాటలు కూడా చాలా హుందాగా ఉంటాయి. అయితే ఆయన తన కొడుకు కార్తికేయ వివాహంలో మాత్రం చిన్నపిల్లాడిలా మారిపోయాడు. కొడుకు కార్తికేయ పెళ్లిని తాజాగా జైపూర్‌ లోని కోటలో నిర్వహించిన రాజమౌళి ఆ వివాహ వేడుకలో వచ్చిన అతిథుతో పాటు తను కూడా సంగీత్‌ లో స్టెప్‌ లు వేయడంతో పాటు జైపూర్‌ సాంప్రదాయ దుస్తులు ధరించి సెంట్రాఫ్‌ అట్రాక్షన్‌ గా నిలిచాడు.

రామ్‌ చరణ్‌ తో కలిసి సమానంగా రాజమౌళి వేసిన స్టెప్పులు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. జక్కన్నలో ఈ కొత్త యాంగిల్‌ ను చూసిన వారు నోరు వెళ్లబెడుతున్నారు. జక్కన్న ది గ్రేట్‌ అంటూ మరోసారి ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కార్తికేయ పెళ్లిలో కేవలం రాజమౌళి డాన్స్‌ మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో ఎన్నో సంఘటనలు - డాన్స్‌ లు - కలయికలు వైరల్‌ అయ్యాయి. కార్తికేయ - పూజాల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వివాహ రిసెప్షన్‌ త్వరలోనే హైదరాబాద్‌ లో నిర్వహించే అవకాశం ఉంది.

పెళ్లిలో రామ్‌ చరణ్‌ దంపతులు - ఎన్టీఆర్‌ దంపతులు - ప్రభాస్‌ - అనుష్క - రానా - నాగార్జున - అఖిల్‌ ఇంకా ఎంతో మంది టాలీవుడ్‌ సెలబ్రెటీలు ఈ వివాహ వేడుకలో పాల్గొన్నారు. కార్తికేయ ‘బాహుబలి’ చిత్రానికి సహాయ దర్శకుడిగా చేయడంతో పాటు - ప్రస్తుతం పూర్తి స్థాయి నిర్మాతగా కూడా మారిన విషయం తెల్సిందే. ఇక పూజ విషయానికి వస్తే ఆమె భక్తి పాటలు ఎన్నో పాడి గాయినిగా ఇప్పటికే మంచి గుర్తింపు దక్కించుకుంది. వీరిద్దరు ప్రేమించుకుని పెళ్లి పీఠలు ఎక్కారు.

వీడియో కోసం క్లిక్ చేయండి

Full View
Tags:    

Similar News