రాజమౌళి ఇప్పుడు మరో భారీ సెట్ నిర్మించే పనిలో పడ్డాడు. బాహుబలి సినిమా కోసం మొత్తం టీమ్ అంతా కలిసి కొన్నేళ్ళ పాటుగా మహిష్మతి రాజ్యం నిర్మించారు. అందులో ఉన్న గదులు - సభలు - ప్రాంగణాలు - పెద్ద స్తంభాలు - జలపాతాలు - పచ్చని కొండలు - పారే సెలఏరులు అన్నీ చాలా అద్భుతంగా డిజైన్ చేశారు ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇప్పుడు కూడా అలానే మరో సెట్ వేయబోతున్నారు.
ఇంతకీ ఆ సెట్ సినిమా కోసం కాదండోయ్. జక్కన్న రాజమౌళి తన సొంత ఇంటి కల కోసం. హైదరాబాదుకు దూరంగా దొనకొండలో ఒక ఫార్మ్ హౌస్ కట్టుకునే ప్రయత్నంలో ఉన్నాడట జక్కన్న. దానికోసం 100 ఏకరాలు స్థలం కూడా కొనేశాడు కూడా అని తెలుస్తోంది. 100 ఏకరాల స్థలంలో పచ్చని పొలాల మధ్య పల్లెటూరు ప్రాంతంలా - మన సంస్కృతి కి తార్కాణంలా, ప్రకృతి సహజత్వం ప్రతిబింబించేలా, అక్కడక్కడా చిన్న గుడిసెలు ఉన్న ప్రాంతాలు ఇలా ఒక ఊరు లాంటి ఇల్లు కట్టుకోబోతున్నాడట. బాహుబలి కి సెట్ వేసినంత దీక్షగా నిర్మాణం జరగబోతుందని.. ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ డిజైన్ చేస్తున్నాడని కూడా టాక్.
ఇకపోతే రాజమౌళి పెద్దన్న కీరవాణి కూడా అక్కడ ఒక స్థలం కొన్నారట. ఇతనితో పాటుగా ఆ కుటంబానికి స్నేహితుడైన సాయి కొర్రపాటి కూడా అక్కడే ఇల్లు కట్టుకోవడానికి స్థలం కొన్నారని ఇండస్ర్టీ టాక్. మొత్తానికి ఫ్రెండ్స్ అండ్ రెలెటివ్స్ బ్యాచ్ అంతా అక్కడే సెటిలయ్యారులే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/