అ’ ప్రి రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా వచ్చిన దర్శక ధీరుడు రాజమౌళి.. వరుస హిట్లతో దూసుకెళ్తున్ నాని సూపర్ ఫామ్ గురించి గొప్పగా మాట్లాడుతూనే ఈ మధ్య నాని ఎంచుకున్న పాత్రల విషయంలో తన అసంతృప్తిని చెప్పకనే చెప్పేశాడు. ఆ మధ్య నాని నటించిన సినిమా ఒకటి పెద్ద హిట్టయిందని.. అది చూసిన అనంతరం తాను నానికి మెసేజ్ పెట్టానని.. వరుసగా హిట్లు కొడుతుండటం ఓకే కానీ.. నీ నుంచి ఇంతకుమించి ఆశిస్తున్నానని అందులో చెప్పానని.. తనతో పాటు నాని స్నేహితులు.. అభిమానుల ఆకాంక్ష ఇదే అని రాజమౌళి అన్నాడు.
అంతర్గతంగా చెప్పుకునే విషయాల్ని రాజమౌళి ఇలా బహిరంగంగా ఒక సినిమా వేడుకలో చెప్పడాన్ని బట్టి .. దీని ప్రాధాన్యమేంటన్నది అర్థం చేసుకోవచ్చు. నిజానికి నాని అభిమానులందరి ఆకాంక్షనే రాజమౌళి అక్కడ బయటపెట్టాడు. గొప్ప నటుడిగా.. ఏ పాత్రకైనా వెయిట్ తీసుకురాగల నటుడిగా పేరు తెచ్చుకున్న నాని.. ఈ మధ్య రొటీన్ క్యారెక్టర్లలో నిరాశ పరుస్తున్నాడు. నాని సినిమాలు ఏదో అలా ఆడేయడమైతే ఆడేస్తున్నాయి కానీ.. వాటిలో విషయం ఉండట్లేదని.. రొటీన్ గా ఉంటున్నాయని విమర్శలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ విషయంలో ఈ విమర్శలు గట్టిగా వినిపించాయి. నాని లాంటి నటుడికి ఇలాంటి సినిమాలు ఏమాత్రం పరీక్ష పెట్టవు. అతడి టాలెంట్ ఇలాంటి సినిమాలతో వృథా అయిపోతోందనే చెప్పాలి. అలాంటివాడు ఛాలెంజింగ్ క్యారెక్టర్లు.. కొత్త తరహా సినిమాలు ఎంచుకోవడం అవసరం. నిర్మాతగా ‘అ’ లాంటి వైవిధ్యమైన సినిమాకు సపోర్ట్ ఇచ్చినవాడు.. తాను సొంతంగా రొటీన్ బాటలో సాగిపోతుండటం నిరాశ పరిచే విషయం. మరి రాజమౌళి స్వీట్ వార్నింగ్ తో నాని అప్రమత్తమై ఇక ముందైనా భిన్నమైన సినిమాలతో వస్తాడేమో చూద్దాం.