కార్తికేయ రాజమౌళి సొంత కొడుకు కాదు

Update: 2017-04-10 11:11 GMT
ఇది కొంతమందికి తెలిసిన విషయమే కావచ్చు. ఐతే ఇప్పుడు స్వయంగా రాజమౌళి సతీమణి రమనే స్వయంగా ఈ విషయాన్ని చెప్పింది. ఎస్.ఎస్.కార్తికేయ రాజమౌళికి సొంత కొడుకు కాదని.. కార్తికేయకు రాజమౌళి స్టెప్ ఫాదర్ అని తాజాగా ఒక ఇంటర్వ్యూలో రమ వెల్లడించింది. రాజమౌళితో 2001లో తనకు పెళ్లయ్యే సమయానికే తనకు కొడుకున్నాడని..  రాజమౌళి అతడిని సొంత కొడుకులాగే చూసుకుంటాడని ఆమె తెలిపింది.

‘‘కార్తికేయకు రాజమౌళి సొంత తండ్రి కాక పోయినా.. నాకు కానీ.. మాలో ఎవ్వరికి కానీ అతను రాజమౌళికి బయోలాజికల్ సన్ కాదు అన్నఆలోచ‌నే రాదు. చిన్నప్పటి నుంచి ఒద్దరూ ఒకరినొకరు యాక్సెప్ట్ చేశారు. మా పెంపకం కూడా అలాగే ఉంటుంది’’ అని రమ తెలిపారు. రాజమౌళికి పని మీద ఎంత ఫోకస్ ఉంటుందో.. ఫ్యామిలీ అన్నా అంతే ఇష్టం ఉంటుందని.. తామిద్దరం కలిస్తే సినిమాల గురించి కాకుండా రిటైరయ్యాక ఏ ఊర్లు.. ఏదేశాలు తిరగాలి.. ఏమేం చేయాలి అని చర్చించుకుంటామని ఆమె చెప్పారు. ప్రతి సినిమా అయిపోగానే తాము హాలిడే వెళ్తామని.. అక్కడే తర్వాతి సినిమాకు సంబంధించిన ఆలోచన రాజమౌళిలో మొదలవుతుందని అన్నారు. ఏ ఆలోచన వచ్చినా ముందు తనకే చెబుతాడని రమ చెప్పారు.

రాజమౌళికి పనిలో పడితే లోకం తెలియదని.. చాలా అయోమయంలో ఉంటాడని రమ అన్నారు. ‘‘కొన్నిసార్లు పనిలో పడిపోయి అన్నీ మరిచిపోతారు. ఓసారి వేరేవాళ్ల‌ ఇంటికెళ్లి ఫోన్ అనుకుని రిమోట్ కంట్రోల్ జేబులో పెట్టుకుని తెచ్చేశాడు. ఏదో మాట్లాడుకుంటూ మరిచిపోయి ఓసారి కార్ తాళాలు తెచ్చాడు. ఇంట్లో ఏదైనా కనిపించకుంటే తన జేబులోనే వెతుకుతుంటాం. సినిమా చేస్తుంటే అదయ్యే వరకు అయోమయంగా ఉంటాడు. పోస్ట్ ప్రొడక్షన్ సమయం వచ్చే సమయానికి తను వేరే జోన్లో ఉంటాడు’’ అని రమ చెప్పింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News