ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సినిమాల్లో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR ప్రముఖమైనది. బాహుబలి ఘన విజయం తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఈ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 8న ఈ సినిమా రిలీజ్ అవుతుందని ఇప్పటికీ ఫిలింమేకర్లు ప్రకటించారు. ఈ లాక్ డౌన్ కారణంగా షూటింగ్ ఆగిపోవడంతో ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉందని అంటున్నారు కానీ ఈ విషయం పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
ఇదిలా ఉంటే మార్చి 27వ తారీఖు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన భీమ్ ఫర్ రామరాజు వీడియో కు భారీ స్పందన దక్కింది. చరణ్ పోషిస్తున్న అల్లూరి సీతారామరాజు పాత్రకు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో ఇంట్రడక్షన్ ఇవ్వడం అందరినీ మెప్పించింది. మే 20వ తారీఖు ఎన్టీఆర్ పుట్టినరోజు. అభిమానులకు కానుకగా ఆ రోజున రామరాజు ఫర్ భీమ్ వీడియోను విడుదల చేస్తారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే లాక్ డౌన్ కారణంగా ఈ టీజర్ పనులను రాజమౌళి వీడియో కాల్స్ ద్వారా పర్యవేక్షిస్తున్నారట. ఎన్టీఆర్ తరహాలోనే చరణ్ కూడా కొమరం భీమ్ కు ఒక పవర్ఫుల్ ఇంట్రడక్షన్ ఇస్తారని.. ఆ వాయిస్ ఓవర్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి అంటున్నారు.
అయితే లాక్ డౌన్ కారణంగా ఎవరి ఇంట్లోనే వారు ఉంటూ ఈ పనులను చక్కబెడుతూ ఉన్నారని.. మే 20 నాడు RRR టీం మరోసారి ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడం ఖాయమని అంటున్నారు. అయితే ఎన్టీఆర్ తరహాలోనే అన్ని భాషల్లో వాయిస్ ఓవర్ ఇస్తారా లేక తెలుగు హిందీ తో మాత్రమే సరి పెడతారా అనేది వేచి చూడాలి.