రిలీజ్‌కి ముందే ఫిలింలీకేజీ.. మన దర్శకనిర్మాతల్ని బెంబేలెత్తిస్తున్న తాజా పరిణామం ఇది. అత్తారింటికి దారేది ఫుటేజ్ బయటికి వచ్చినప్పట్నుంచి మేకర్స్ అంతా ఈ విషయంపైనే చర్చించుకున్నారు. అప్పటికి సినిమా తీస్తున్నవాళ్లంతా తీవ్రంగా అలెర్టయిపోయారు. ముఖ్యంగా రాజమౌళి క్షణం కూడా కంటిమీద కునుకేయకుండా బాహుబలి లీకవ్వకుండా కాచుకున్నాడు.
అయితే వన్ ఫైన్ డే ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ వల్ల అది కాస్తా లీకై దారుణ పరిణామాల్ని తెచ్చిపెట్టింది. దాంతో జక్కన్న మరింత అలెర్టయిపోయి కనీసం ఫోటోల్ని కూడా లీకేజ్ కాకుండా కాపాడుకున్నాడు. ఇప్పుడు సినిమా పూర్తయింది. బాహుబలి అన్నిపనులు ముగించుకుని ఒకేసారి నాలుగు భాషల్లో సెన్సార్‌కి వెళుతోంది. తెలుగులో సెన్సార్ పూర్తయ్యాక హిందీ, తమిళ్, మలయాళంలోనూ సెన్సార్ పనులు పూర్తి చేయనున్నారు. ఒకవేళ ఒకే సమయంలో అన్నిచోట్లా సెన్సార్ జరిగితే ఆ టైమ్‌లో రాజమౌళి ఒక్కడే మ్యానేజ్ చేయడం కష్టం కాబట్టి మిగతా బృందాన్ని వేరొక చోట సెన్సార్‌కి పంపించాల్సిందే. అయితే సెన్సార్ బృందంపైనా డేగ కన్నేసి ఉంచేందుకు వేగుల్ని సిద్ధం చేశాడు.
ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి లీకేజీ ఎవరినుంచీ సాధ్యపడకుండా జాగ్రత్త పడుతున్నాడు. అందులో భాగంగానే ప్రివ్యూ వేసే థియేటర్‌లో ప్రొజెక్టర్ ఆపరేటర్‌ని కూడా వదిలిపెట్టడం లేదు. ప్రొజెక్టర్ ఆన్ అవ్వగానే అతడు ఆపరేటింగ్ రూమ్‌ని వదిలి వెళ్లిపోవాల్సిందేనని పట్టుబడుతున్నాడట. అలాగే థియేటర్‌లో సినిమా చూసేవాళ్లందరినీ పక్షిలా వీక్షించేందుకు డిటెక్టివ్‌లను నియమించాడట. అది సంగతి.