బాలీవుడ్ బాద్‌షా షారూక్‌ఖాన్ ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో నటించనున్నారా? అంటే అవుననే సమాచారం. రాజమౌళి ప్రస్తుతం బాహుబలి పోస్ట్ ప్రొడక్షన్‌లో బిజీ. బాహుబలిని తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో భారీ రేంజులో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఉత్తరాదిన 'మఖ్ఖీ' సినిమాతో రాజమౌళి క్రేజు అసాధారణంగా పెరిగింది.
'మఖ్ఖీ దర్శకుడి నుంచి వస్తున్న సినిమా' అంటూ ఇప్పటికే బాహుబలి ప్రచారం మొదలెట్టేశారక్కడ. ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై కరణ్‌జోహార్ రిలీజ్ చేస్తున్నారు. కరణ్ ఓ సినిమాకి అంగీకరించాడంటే అతడికి ఎంతో నచ్చితే కానీ ఆ పని చేయడు. ప్రతిదానికీ లెక్కలు పక్కాగా ఉంటాయి. బాహుబలిలోని కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్, విజువల్ బ్రిలియన్సీ కరణ్‌కి నిద్రకరువయ్యేలా చేశాయట. అందుకే అతడు స్వయంగా రంగంలోకి దిగి బాహుబలిని హిందీలో రిలీజ్ చేస్తున్నారని తెలుస్తోంది.
ఇక కరణ్‌జోహార్‌కి షారూక్‌ఖాన్ అత్యంత సన్నిహితుడు. కాబట్టి రాజమౌళితో బాద్‌షా సినిమా చేసే అవకాశం ఉంది. ఇక ఆ ఒక్కటీ ఇంకెంతో దూరంలో లేదు. రాజమౌళి బాలీవుడ్ ఆరంగేట్రం కింగ్ ఖాన్‌తో అదిరిపోవడం ఖాయం అని చెబుతున్నారు. బాద్‌షాతో సినిమా అంటే రూ.500కోట్ల క్లబ్ సినిమా అనే అర్థం. అంతర్జాతీయ స్థాయిలో రాజమౌళి ఖ్యాతి రెట్టింపవ్వడం ఖాయం.