సౌత్ లో పాగా వేయ‌డానికేనా?

Update: 2021-12-20 02:30 GMT
నార్త్ స్టార్ లు సౌత్ లో పాగా వేయాల‌ని గ‌త కొన్నేళ్లుగా ప్ర‌య‌త్నాలు చేస్తూనే వున్నారు కానీ ఏ హీరో ఆ విష‌యంలో స‌క్సెస్ సాధించ‌లేక‌పోయాడు. అంతే కాకుండా వ‌సూళ్ల ప‌రంగా బాక్సాఫీస్ వ‌ద్ద భారీ నెంబ‌ర్ ల‌ని ద‌క్కించుకోవాల‌ని ప్ర‌య‌త్నాలు చేసి విఫ‌ల‌మ‌య్యారే కానీ స‌ఫ‌లం కాలేక‌పోయారు. ఇక త‌మిళ‌నాడు ఆడియ‌న్స్‌ని కూడా ప్ర‌స‌న్నం చేసుకోవాల‌ని చూడని బాలీవుడ్ స్టార్ లేడంటే అది అతిశ‌యోక్తి కాదు. బాలీవుడ్ బాద్ షాగా చెప్పుకున్న షారుక్ ఖాన్ ఏకంగా చెన్నై ఎక్స్ ప్రెస్` పేరు తో సినిమా చేసి చెన్నై నేప‌థ్యాన్ని ఎంచుకుని సూప‌ర్ హిట్ ని సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే.

ఇలా ప్ర‌తీ సూప‌ర్ స్టార్ నుంచి క్రేజీ హీరోల వ‌ర‌కు సౌత్‌ని ప్ర‌స‌న్నం చేసుకోవాల‌ని చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు. తాజాగా అలాంటి ప్ర‌య‌త్న‌మే `బ్ర‌హ్మాస్త్ర‌` మోష‌న్ పోస్ట‌ర్ రిలీజ్ కార్య‌క్ర‌మంలో స్ప‌ష్టంగా క‌నిపించింది. అమితాబ్ బ‌చ్చ‌న్ , ర‌ణ్ బీర్ క‌పూర్‌, అలియా భ‌ట్, నాగార్జున కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న చిత్రం `బ్ర‌హ్మాస్త్ర‌`. అయాన్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీ మొత్తం మూడు భాగాలుగా విడుద‌ల కాబోతోంది.

ముందుగా తొలి పార్ట్ ని రిలీజ్ చేయ‌బోతున్నారు. ఈ సంద‌ర్భంగా చిత్ర బృందం ప్ర‌మోష‌న్స్ ని ప్రారంభించింది. ముంబైలో హిందీ వెర్ష‌న్ మోష‌న్ పోస్ట‌ర్ ని విడుద‌ల చేసిన మేక‌ర్స్ హైద‌రాబాద్ లోనూ తెలుగు వెర్ష‌న్ ని విడుద‌ల చేసేందుకు ఓ కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలొ క‌ర‌న్ జోహార్‌, ర‌ణ్ బీర్ క‌పూర్‌, నాగార్జున‌, అలియా భ‌ట్‌, ద‌ర్శ‌కుడు అయాన్ ముఖ‌ర్జీ పాల్గొన్నారు ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా రాజ‌మౌళి హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా రాజ‌మౌళి ద‌ర్శ‌కుడు అయాన్ ముఖ‌ర్జీపై చేసిన వ్యాఖ్య‌లు టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా నిలిచాయి. ఇత‌నేంటీ నా కంటే పిచ్చోడిలా వున్నాడ‌ని అనిపించింద‌ని, సినిమా ఓ రేంజ్ లో వుంటుంద‌ని ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడితో పాటు ర‌ణ్ బీర్ క‌పూర్ పై కూడా ప్ర‌శంస‌లు కురిపించాడు. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు అయాన్ ముఖ‌ర్జీ .. నాగార్జున‌ కాళ్లు తాకి అంద‌రి మ‌న‌సు దోచుకునే ప్ర‌య‌త్నం చేశాడు. ఇదే త‌ర‌హాలో ర‌ణ్ బీర్ క‌పూర్ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి కాళ్ల‌కి న‌మ‌స్క‌రించ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. అయితే ఇది సౌత్ లో పాగా వేయ‌డానికే ర‌ణ్ బీర్‌, అయాన్ ముఖ‌ర్జీ ఇలా చేశార‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది.
Tags:    

Similar News