ప్రియాంక పాత్రకు నెగిటివ్ షేడ్స్?
ఆర్ఆర్ఆర్ తర్వాత ఎంతో గ్యాప్ తీసుకున్న దర్శకధీరుడు రాజమౌళి తన తర్వాతి సినిమాను టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్న విషయం తెలిసిందే.
ఆర్ఆర్ఆర్ తర్వాత ఎంతో గ్యాప్ తీసుకున్న దర్శకధీరుడు రాజమౌళి తన తర్వాతి సినిమాను టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్న విషయం తెలిసిందే. పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కొన్ని వారాల కిందటే మొదలైంది. ఈ సినిమా మహేష్ కెరీర్లో 29వ సినిమాగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరెక్కుతుంది.
ఈ సినిమాలోని ఓ కీలక పాత్రలో నటిస్తోన్న ప్రియాంక చోప్రా రీసెంట్ గా తన సోదరుడు పెళ్లి కారణంగా గ్యాప్ తీసుకోవడంతో షూటింగ్ కు బ్రేక్ వచ్చింది. తాజా సమాచారం ప్రకారం ఎస్ఎస్ఎంబీ29 షూటింగ్ తిరిగి ఈ వీకెండ్ లో మొదలుకానున్నట్టు తెలుస్తోంది. ఈ షూటింగులో బాలీవుడ్ స్టార్ నానా పటేకర్ కూడా జాయిన్ కానున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఇప్పటివరకు నానా పటేకర్ క్యాస్టింగ్ గురించి కానీ, ఆయన ఫలానా పాత్ర చేయబోతున్నాడని కానీ చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అనౌన్స్‌మెంట్ వచ్చింది లేదు. ఇదిలా ఉంటే ఈ వీకెండ్ లో మొదలు కానున్న కొత్త షెడ్యూల్ లో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా పాత్రలపై కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నాడట రాజమౌళి.
ఈ సినిమాలో ప్రియాంక చోప్రా పాత్రను జక్కన్న చాలా ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేశాడని, ఆ పాత్రకు కొన్ని నెగిటివ్ షేడ్స్ కూడా ఉంటాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదంతా వింటుంటే రాజమౌళి మాస్టర్ మైండ్ ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్టనిపిస్తుంది. ఆస్కార్ విజేత కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన వివరాలేమీ ఇంకా బయటకు రాలేదు.
ఎస్ఎస్ఎంబీ29 కు సంబంధించిన ప్రతీ విషయాన్ని మేకర్స్ చాలా సీక్రెట్ గా ఉంచుతున్నారు. దీంతో ఈ సినిమాను రాజమౌళి ఎప్పుడెప్పుడు సినిమా గురించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇస్తాడా అని మహేష్ బాబు ఫ్యాన్స్ తో పాటూ ప్రతీ ఒక్కరూ ఎదురుచూస్తున్నారు. ఫారెస్ట్ అడ్వెంచరస్ మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమాను కె.ఎల్ నారాయణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.