తండేల్ కొత్త సీన్లు యాడ్ చేస్తున్నారా?

నాగ‌చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన తండేల్ సినిమా భారీ అంచ‌నాల‌తో రిలీజై మంచి పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వ‌ద్ద స‌క్సెస్‌ఫుల్ గా ర‌న్ అవుతోంది.

Update: 2025-02-13 06:57 GMT

నాగ‌చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన తండేల్ సినిమా భారీ అంచ‌నాల‌తో రిలీజై మంచి పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వ‌ద్ద స‌క్సెస్‌ఫుల్ గా ర‌న్ అవుతోంది. సంక్రాంతి సినిమాల హ‌డావిడి త‌గ్గాక ఈ సినిమా రిలీజవ‌డంతో పాటూ సోలో రిలీజ్ కూడా తండేల్‌కు బాగా ప్ల‌స్ అయింది. సినిమా రిలీజై వారం రోజుల‌వుతున్నా మేక‌ర్స్ ప్ర‌మోష‌న్స్ విష‌యంలో మాత్రం అస‌లు వెనుక‌డుగేయ‌డం లేదు.

ఇదిలా ఉంటే ఆడియ‌న్స్ కోసం మేక‌ర్స్ ఓ స్వీట్ స‌ర్‌ప్రైజ్ ను ప్లాన్ చేస్తున్నార‌ని తెలుస్తోంది. ఆ స‌ర్‌ప్రైజ్ మ‌రేదో కాదు. తండేల్ సినిమాకు కొంత ఎక్స్‌ట్రా ఫుటేజ్ ను యాడ్ చేసి రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నార‌ట‌. ఈ రోజుల్లో సినిమా ప్రింట్ ను ముందు రిలీజ్ చేసేసి ఆ త‌ర్వాత కొన్నాళ్ల‌కు దానికి ఎడిటెడ్ వెర్ష‌న్ ను కూడా రిలీజ్ చేయ‌డం కామ‌న్ అయిపోతుంది.

తండేల్ విష‌యంలో కూడా మేక‌ర్స్ అదే చేయ‌నున్నార‌ట‌. క‌థ‌ను క్రిస్పీగా చెప్పాల‌నే ఉద్దేశంతో కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ ను సైతం మేక‌ర్స్ ఎడిట్ చేసేశార‌ట‌. కానీ ఇప్పుడు సినిమాకు వ‌స్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆడియ‌న్స్ ఆ సీన్స్ ను కూడా ఎంజాయ్ చేస్తార‌నిపించి, వాటిని కూడా సినిమాకు జోడించాల‌ని భావిస్తున్నార‌ట‌.

తండేల్ కు ఈ సీన్స్ యాడ్ చేశాక ఆడియ‌న్స్ ఇంకా ఎక్కువ సంఖ్య‌లో థియేట‌ర్ల‌కు వ‌స్తార‌ని మేక‌ర్స్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఒక‌వేళ ఆ సీన్స్ ను థియేట్రిక‌ల్ వెర్ష‌న్ కు యాడ్ చేయ‌డం కుద‌ర‌క‌పోతే క‌నీసం ఓటీటీలో అయినా యాడ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట మేక‌ర్స్. ఇప్ప‌టికే ఈ విష‌యంపై తండేల్ టీమ్ మ‌ధ్య చ‌ర్చ‌లు కూడా జ‌రిగాయ‌ని స‌మాచారం.

ప్ర‌స్తుతం థియేట‌ర్ల‌లో తండేల్ మూవీ స‌క్సెస్‌ఫుల్ గా ర‌న్ అవుతుంది కాబ‌ట్టి ఇప్ప‌ట్లో సినిమా ఓటీటీలోకి వ‌చ్చే అవ‌కాశం లేదు. దీంతో సినిమాలో కొత్త‌గా సినిమాలో యాడ్ చేయ‌నున్న సీన్స్ ను ఆడియ‌న్స్ థియేట‌ర్ల‌లో చూడాలా లేక ఓటీటీలో చూడాలా అని సందేహిస్తున్నారు. చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ సినిమా శ్రీకాకుళానికి చెందిన కొంద‌రు మ‌త్య్స‌కారుల జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కిన విష‌యం తెలిసిందే.

Tags:    

Similar News