‘బాహుబలి: ది కంక్లూజన్’ ట్రైలర్ ఉదయం థియేటర్లలో ప్రదర్శించి.. ఆ తర్వాత సాయంత్రం ఐదు గంటలకు యూట్యూబ్ లోకి వస్తుందన్నది కొన్ని రోజుల నుంచి జరుగుతున్న ప్రచారం. ‘బాహుబలి’ నిర్మాతలు కూడా ఇదే విషయం ఖరారు చేశారు. ‘బాహుబలి: ది బిగినింగ్’ ట్రైలర్ విషయంలోనూ ఇలాగే చేశారు. కానీ ఆశ్చర్యకరంగా ‘ది కంక్లూజన్’ ట్రైలర్ ఉదయం పది గంటలకే యూట్యూబ్ లోకి వచ్చేసింది. ఇది ఎవ్వరూ ఊహించని విషయం. ముందు ట్రైలర్ యూట్యూబ్ లోకి వచ్చేసిందంటే.. థియేటర్ల నుంచి వీడియో తీసి పెట్టారేమో అనుకున్నారు చాలామంది. కానీ మంచి క్వాలిటీతో ఒరిజినల్ ట్రైలర్నే ఇలా రిలీజ్ చేశారన్న సంగతి ఆ ట్రైలర్ చూశాక కానీ అర్థం కాలేదు.
మరి ట్రైలర్ సాయంత్రం కాకుండా ఉదయమే ఎందుకు బయటికి వచ్చేసింది.. ఇలా చేస్తే ఇక థియేటర్లలో ట్రైలర్ని ప్రత్యేకంగా ప్రదర్శించడంలో అర్థమేముంది.. ఇదే విషయం రాజమౌళిని అడిగితే.. ఇది అనుకోకుండా జరిగిన పొరబాటన్నారు. ‘‘సాయంత్రం 5 గంటలకే ట్రైలర్ లాంచ్ చేద్దామనుకున్నాం. కానీ ఫేస్ బుక్ లో వచ్చిన బగ్ కారణంగా అనుకున్నదానికంటే ముందే ట్రైలర్ విడుదలైపోయింది. అసలిలా ఎందుకు జరిగిందో విచారిస్తున్నాం. ఐతే దీనికి ఎవరూ బాధ్యులు కాకపోవచ్చు. ఇది లీక్ కూడా కాదనుకుంటున్నాం. ఏదేమైనా ట్రైలర్ చూసిన అభిమానులు సంతోషంగా ఉన్నారు’’ అని రాజమౌళి అన్నాడు. ఐతే ఫేస్ బుక్ లో బగ్ కారణంగా ట్రైలర్ ముందు వచ్చేసిందన్న సంగతే నమ్మశక్యంగా అనిపించట్లేదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/