మిగతా దర్శకుల సినిమాలు వేరు.. రాజమౌళి సినిమాలు వేరు. మిగతా దర్శకులు సినిమాలను తీస్తారు గానీ ఈయన మాత్రం మహాశిల్పి జక్కన్న తరహాలో ఓ కళాఖండంలా చెక్కుతాడు. అందుకే ఆ సినిమాలు పెద్ద హిట్లు అవుతూ ఉంటాయి. ఇక షూటింగ్ కోసం కూడా ఎక్కువ సమయం తీసుకుంటాడు.. మరిప్పుడు #RRR సినిమా పరిస్థితి ఏంటి.. ఎప్పటివరకూ రామ్ చరణ్.. తారక్ లు ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంటుంది?
అక్టోబర్ 2019 వరకూ చరణ్.. తారక్ ల డేట్స్ కావాలని అడిగాడట రాజమౌళి. దసరా లోపు షూటింగ్ పార్ట్ మొత్తం కంప్లీట్ చేసేలా రాజమౌళి ప్లాన్ చేసుకున్నాడని సమాచారం. అప్పటినుండి పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇద్దరు హీరోలు ఇతర ప్రాజెక్టులపై పని చేయడం మొదలుపెట్టొచ్చు. ఒకవేళ అనుకున్నట్టుగా జరిగితే చరణ్.. ఎన్టీఆర్ ల కొత్త సినిమాలు నెక్స్ట్ దసరాకు లాంచ్ అవుతాయి. కానీ #RRR షూటింగ్ డిలే అయిన పక్షంలో ఇద్దరి కొత్త సినిమాల షూటింగ్ కూడా ఆలస్యం అవుతుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్లు.. ఇతర నటుల వివరాలు ఇంతవరకూ వెల్లడించలేదు. రాజమౌళి ఇప్పటికే హీరోయిన్లను ఫైనలైజ్ చేసినప్పటికీ సింపుల్ గా అలా వెల్లడించాలని అనుకోవడం లేదట. సంక్రాంతి పండగ సందర్భంగా హీరోయిన్లు.. ఇతర నటుల వివరాలను అనౌన్స్ చేసి దేశవ్యాప్తంగా అందరి నోళ్ళలో నానేలా చేయాలన్నది అయన ప్లానట. రాజమౌళి మార్కెటింగ్ స్ట్రేటజీలు అలానే ఉంటాయి మరి!