బాహుబలి2 చారిత్రాత్మక విజయం సాధించి.. దేశంలోనే అతి పెద్ద చిత్రంగా అవతరించిన తర్వాత.. దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఏం చేసినా రకరకాల అర్ధాలు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమాకి లాభాల నుంచి వాటాల రూపంలో భారీ మొత్తమే చేతికి అందడంతో.. ఈ మొత్తాన్ని స్థలాలపై ఇన్వెస్ట్ చేస్తున్నాడంటూ పలు ఏరియాల పేర్లు చెబుతున్నారు.
బాహుబలి ది కంక్లూజన్ విడుదలకు ముందే.. హైద్రాబాద్ పరిసరాల్లో 20 ఎకరాలు కొన్నాడని అన్నారు. ప్రస్తుతం ఈ ఫిగర్ 100 ఎకరాలకు చేరిపోయింది. దొనకొండ సమీపంలో ఈ ఫామ్ హౌస్ ఉంటుందని టాక్. మరోవైపు ఉత్తరాంధ్ర స్థానిక ఎగ్జిబిటర్లకు.. తాజాగా నిర్మాత సాయి కొర్రపాటి ఓ పార్టీ ఇచ్చాడు. బాహుబలి2 ను ఇక్కడ రిలీజ్ చేసింది ఈయనే. ఆల్ టైం రికార్డ్ స్థాయిలో 25 కోట్ల మొత్తాన్ని వసూలు చేసిందీ చిత్రం. వైజాగ్ లో జరిగిన ఈ పార్టీకి చీఫ్ గెస్ట్ రాజమౌళి అని ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు.
అయితే.. ఈ పార్టీ తర్వాత.. రాజమౌళి వైజాగ్ లో ల్యాండ్ కొనబోతున్నాడంటూ టాక్ వచ్చింది. బీచ్ గెస్ట్ హౌస్ కట్టుకునేందుకు గాను.. వైజాగ్ పరిసరాల్లో కొన్ని ఎకరాలు కొనబోతున్నాడన్నది వీటి సారాంశం. నిజంగా రాజమౌళి ఇన్నేసి కొనేయాలని అనుకుంటున్నాడో లేదో తెలీదు కానీ.. ఎక్కడికి వెళితే అక్కడ స్థలాలు కొనడానికి చూస్తున్నాడని అనే రూమర్ పుట్టించడం కరెక్ట్ కాదేమో!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/