టాలీవుడ్లోని చాలామంది స్టార్ హీరోలతో పోలిస్తే చాలా భిన్నంగా కనిపిస్తాడు ప్రభాస్. ఇండస్ట్రీ జనాలతో అతను కలవడం తక్కువ. పబ్బులు.. పార్టీల్లో అస్సలు కనిపించడు. సినిమా వేడులకు కూడా దూరంగా ఉంటుంటాడు. చాలా సింపుల్ గా కనిపిస్తాడు. తనేదో తన పనేదో అన్నట్లుగా ఉంటాడు. ఐతే ప్రభాస్ లో చాలామందికి తెలియని కొత్త కోణాలు చాలానే ఉన్నాయి అంటున్నాడు రాజమౌళి. వ్యక్తిగత జీవితంలో అతను పరమ బద్దకిస్టు అని.. అతనో అపరిచితుడి తరహా అని రాజమౌళి చెప్పడం విశేషం. ప్రభాస్ బద్దకానికి సంబంధించి రాజమౌళి ఓ ఆసక్తికర ఘటనను కూడా మీడియాతో షేర్ చేసుకున్నాడు.
‘బాహుబలి’ జర్నీలో భాగంగా ఒకసారి తామందరం ముంబయి విమానాశ్రయంలో ఉన్నామని.. ఇంకో 30 నిమిషాల్లో ఫ్లైట్ బయల్దేరబోతున్నా కూడా ప్రభాస్ చెకిన్ అవ్వకుండా లాంజ్ లో తీరిగ్గా కూర్చుండిపోయాడని చెప్పాడు రాజమౌళి. చెకిన్ అవ్వమని ఎంత చెప్పినా వినలేదట. తామందరం చెకిన్ అయ్యి విమానంలో కూర్చుని టెన్షన్ పడుతుంటే.. ప్రభాస్ తీరిగ్గా చివర్లో వచ్చి విమానం ఎక్కాడని.. ఇంకా మరికొన్ని సందర్భాల్లోనూ ప్రభాస్ ఇలా తన బద్దకాన్ని చూపించాడని తెలిపాడు. ఐతే బయట ఎంత బద్దకిస్టులా ఉన్నప్పటికీ.. సెట్స్ మీదికి వచ్చేసరికి అతను కొత్తగా కనిపిస్తాడని రాజమౌళి చెప్పాడు. సినిమా కోసం అతను పడే కష్టం చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుందని జక్కన్న అన్నాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/