రాజమౌళి ఇప్పుడు దేశం గర్వించదగిన దర్శకులలో ఒకరు. ఆయన నుంచి ఒక సినిమా వస్తుందంటేనే ప్రేక్షక లోకం అంతా కూడా ఎంతో ఆసక్తితో .. ఆత్రుతతో ఎదురుచూస్తూ ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులు థియేటర్లకు రావాలి .. అన్ని వయసుల వారికి తన సినిమా అర్థం కావలి .. అందరూ కోరుకునే వినోదాన్ని తన సినిమా అందించాలి అనే ఉద్దేశంతోనే రాజమౌళి తన సినిమాల రూపకల్పన చేస్తుంటారు. వైవిధ్యభరితమైన కథాకథనాలకు బలమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని తోడుగా ఇచ్చి ముందుకు నడిపిస్తుంటారు.
తెలుగు తెరపై ప్రేక్షకులు రాజులను .. రాజ్యాలను చూసి చాలాకాలమే అయింది. అలాంటి పరిస్థితుల్లో ప్రేమకు పునర్జన్మలను జోడించి రాజరిక వ్యవస్థలోకి ఆయన ప్రేక్షకులను తీసుకుని వెళ్లారు. కోటలు .. గుర్రాలు .. కత్తులు .. డాళ్లు .. యుద్ధాలు ఇవన్నీ తెరపై ఆయన చూపించిన తీరుకు ప్రేక్షకులు ఆశ్చర్య చకితులయ్యారు. జానపదాలను .. పౌరాణికాలను కూడా రాజమౌళి అద్భుతంగా తీయగలరని అంతా చెప్పుకున్నారు. ఆ తరువాత రాజమౌళి మరింత భారీతనంతో 'బాహుబలి'ని థియేటర్లకు తీసుకుని వచ్చారు.
'బాహుబలి' సినిమా చూసినవాళ్లంతా తెలుగులో అప్పటివరకూ అలాంటి సినిమాను చూడలేదని అనుకున్నారు. చెప్పుకోవడానికి చందమామ కథల్లో రాజ్యం కోసం అన్నదమ్ముల మధ్య వైరంలా అనిపించినా, చూడటానికి హాలీవుడ్ మూవీతో సమానంగా అనిపించింది. భారీ సెట్లు .. యుద్ధంలోను వ్యూహాలు .. బాణాలు మిడతల దండులా దూసుకురావడం ప్రేక్షకులను విస్మయానికి గురిచేసింది. ఇక రాజమౌళి 'మహాభారతం'ను తెరకెక్కించగల సమర్థుడు అనే టాక్ మరింత బలంగా వినిపించింది. ఇప్పటికీ ఈ అభిప్రాయాలు వినిపిస్తూనే ఉన్నాయి.
అయితే ఇటీవల రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, 'మహాభారతం' తీయాలంటే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పట్ల తనకి మరింత అవగాహన అవసరం అని చెప్పారు. ఒకవేళ తీస్తే 'కర్ణుడు' పాత్రను ప్రభాస్ కి ఇస్తానని అన్నారు. దాంతో భవిష్యత్తులో రాజమౌళి 'మహాభారతం' తీస్తే, అది కర్ణుడి పాత్రను ప్రధానంగా చేసుకుని నడుస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎన్టీ రామారావు చేసిన 'దాన వీర శూరకర్ణ' తరహాలో .. కర్ణుడి కోణంలో రాజమౌళి మహాభారతం ఉండొచ్చని అనుకుంటున్నారు. త్యాగం .. దానం .. స్నేహధర్మం తెలిసిన వీరుడు కర్ణుడు. ఆ పాత్రకు ప్రభాస్ సరిగ్గా సరిపోతాడు. మరి అభిమానులు ఆశిస్తున్నట్టు .. ఊహిస్తున్నట్టు జరుగుతుందో .. లేదో!