సైరా VFX పై జ‌క్క‌న్న అవాక్క‌య్యే ప్ర‌శ్న‌

Update: 2019-09-23 06:53 GMT
`సైరా` ప్రీరిలీజ్ వేదిక‌పై మెగా హీరోల స్పీచ్ ల‌తో పాటు.. ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి ఇచ్చిన స్పీచ్ ఆద్యంతం ఆక‌ట్టుకుంది. అయితే ఆయ‌న మెగాస్టార్ చిరంజీవిపైనా.. రామ్ చ‌ర‌ణ్ పైనా.. ప‌రుచూరి వారిపైనా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించ‌డ‌మే గాక‌.. మ‌రో ముఖ్య‌మైన మాట‌ను గుచ్చి గుచ్చి మాట్లాడారు.

అదేమిటంటే బాహుబ‌లిని మించి వీఎఫ్ ఎక్స్ ని `సైరా` చిత్రం కోసం ఉప‌యోగించార‌న్న‌ది ఆయ‌న ప్ర‌శంస‌. బాహుబ‌లి2కి 2,200 షాట్లు సుమారుగా ఉప‌యోగిస్తే.. సైరా చిత్రం కోసం ఏకంగా 3,800 వీఎఫ్ ఎక్స్ షాట్స్ ఉప‌యోగించార‌న్న‌ది ఎస్.ఎస్.రాజ‌మౌళి హైలైట్ చేశారు. ఇందుకోసం ఏకంగా 45కోట్లు ఖ‌ర్చు చేసిన సంగ‌తి తెలిసిందే. మ‌రో ముఖ్య‌మైన మాట‌ను ఈ వేదిక‌పై రాజ‌మౌళి గుర్తు చేశారు. క‌మ‌ల్ క‌న్న‌న్.. నాకు సైరా వీఎఫ్ ఎక్స్ షాట్స్ గురించి చెప్పారు. అయితే అది ఎంత క‌ష్ట‌మో నాకు తెలుసు. అన్నివంద‌ల వీఎఫ్ ఎక్స్ షాట్స్ ఉప‌యోగిస్తే దాంతో పాటే ఎక్క‌డా ఎమోష‌న్ మిస్స‌వ్వ‌కుండా జాగ్ర‌త్త ప‌డాల్సి ఉంటుంద‌ని అన్నారు.

ఇది పోటీ ప్ర‌పంచం. ఒక‌రిని మించి ఇంకొక‌రు సినిమాలు తీస్తార‌నేది రాజ‌మౌళి పాయింట్ ఆఫ్ వ్యూనా?  లేక నా అంత ఎమోష‌న‌ల్ గా వీళ్లు సినిమా తీశారా లేదా? అన్నది సైలెంట్ గా పాయింట్ ఔట్ చేశారా? అంటూ ఆ స్పీచ్ ని విశ్లేష‌కులు ఎన‌లైజ్ చేశారు. ఏదైతేనేం... ట్రైల‌ర్ లోనే `సైరా` ఎమోష‌న్ ని పూర్తిగా ఆవిష్క‌రించేయ‌డం కుద‌ర‌లేదు కాబ‌ట్టి సినిమా ఆద్యంతం ఎమోష‌న్ తో సురేంద‌ర్ రెడ్డి ప‌నిత‌నం చూపించార‌నే భావించాల్సి ఉంటుంది. ఈ వేదిక‌పై రాజ‌మౌళి ప్ర‌త్యేకించి సూరికి శుభాకాంక్ష‌లు చెప్పారు.

అలాగే  పరుచూరి బ్రదర్స్ కి జ‌క్క‌న్న థ్యాంక్స్‌ చెప్పారు. ప‌రుచూరి గుండెల్లో ఈ కథని 20 ఏళ్ల పాటు మోశారని అన్నారు. బ్రిటీష్‌ వారిపై మొట్టమొదటగా పోరాడింది మన తెలుగు వాడని అందరికీ తెలిసేలా నా హీరో రామ్‌ చరణ్‌ చేశారు. ఇది మీ డాడీకే గిఫ్ట్‌ కాదు.. మొత్తం తెలుగు వారికి అందిస్తున్న గిఫ్ట్!! అంటూ చెర్రీని పొగిడేశారు జ‌క్క‌న్న‌. అక్టోబ‌ర్ 2న సైరా న‌ర‌సింహారెడ్డి రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే.


Tags:    

Similar News