జక్కన్న నెక్ట్స్‌ విక్రమ్‌ వార్తలో నిజమెంత?

Update: 2021-11-21 12:30 GMT
టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్‌ ఆర్ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. సంక్రాంతికి ముందు వచ్చే ఏడాదిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు గాను అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జక్కన్న ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కించాడు. ఆర్ ఆర్‌ ఆర్ సినిమాను విడుదల చేయకుండానే మహేష్‌ బాబుతో తన తదుపరి సినిమా ఉండబోతుంది అంటూ అధికారికంగా ప్రకటించాడు.

గతంలోనే వీరిద్దరి కాంబోలో సినిమా రావాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల సినిమా ఆలస్యం అయ్యింది. ఎట్టకేలకు సినిమా కన్ఫర్మ్‌ అంటూ నిర్మాత కూడా ప్రకటించాడు. మహేష్‌ బాబు.. రాజమౌళి కాంబో సినిమా కోసం కథను రాస్తున్నట్లుగా విజయేంద్ర ప్రసాద్‌ అధికారికంగా పేర్కొన్నాడు. అంతకు మించి మహేష్‌.. జక్కన్నల కాంబో సినిమా గురించి మరే అధికారిక క్లారిటీ కూడా రాలేదు.

ఈమద్యలో ఎన్నో పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. ఆఫ్రీకన్‌ అడవుల్లో సినిమా అంటూ ఒకరు.. సినిమా లో మహేష్‌ బాబు సూపర్‌ మ్యాన్‌ అంటూ మరొకరు... హాలీవుడ్‌ మూవీ అంటే ఇంకొక్కరు ఇష్టం వచ్చినట్లుగా ఎవరికి వారు ఊహించుకుంటూనే ఉన్నారు. తాజాగా ఒక వార్త ఈ సినిమా గురించి ప్రముఖంగా ప్రచారం జరుగుతోంది. తమిళ స్టార్‌ హీరో చియాన్ విక్రమ్‌ ను జక్కన్న టీమ్‌ సంప్రదించారు అనేది ఆ టాక్.

మహేష్‌ బాబుతో రాజమౌళి చేయబోతున్న సినిమాను వచ్చే ఏడాదిలో మొదలు పెట్టబోతున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ తర్వాత విక్రమ్‌ డేట్లను బల్క్‌ గా జక్కన్న టీమ్ కోరింది అనేది ఆ వార్త సారాంశం. అయితే ఇప్పటి వరకు అలాంటి చర్చలు జరిగాయా లేదా అనేది మాత్రం క్లారిటీ లేదు.

జక్కన్న రాజమౌళి ఒక సినిమా తర్వాత ఒకటి అన్నట్లుగా చేస్తూ ఉంటాడు. ఒక సినిమా విడుదల కాకుండా మరో సినిమా గురించి ఆలోచించే అలవాటు అయితే జక్కన్నకు లేదు అని ఆయన సన్నిహితుల టాక్‌. అంటే ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా విడుదల అయ్యే వరకు తదుపరి సినిమా గురించి ఆయన ఆలోచిస్తాడు అంటే నమ్మకంగా లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్‌ లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆయన సినిమాలు విడుదల అవుతాయి. కనుక ఒక సినిమా తర్వాత ఒకటి అన్నట్లుగా చేసుకుంటూ వస్తున్నాడు.

ఒకే సమయంలో రెండు సినిమాలను ఆయన చేయడు కనుక ఖచ్చితంగా ఈ వార్తలు నిజం అయ్యి ఉండవు అనేది కొందరి అభిప్రాయం. ఒక వేళ నిజం అయితే ఖచ్చితంగా అభిమానులకు పండుగే. మహేష్‌ బాబు మరియు రాజమౌళిల కాంబో సినిమాను కేఎల్‌ నారాయణ నిర్మించబోతున్న విషయం తెల్సిందే.

కనుక జక్కన్న తదుపరి సినిమా గురించి వస్తున్న వార్తలను ఆయన క్లీయర్ చేయాల్సిన అవసరం ఉంది. లేదంటే రాజమౌళి కాంపౌండ్ నుండి అయినా ఈ వార్తల విషయంలో చిన్న క్లారిటీ ఇస్తు బాగుండు అంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా జక్కన్న తదుపరి సినిమా మహేష్ బాబుతో మరో రేంజ్ లో ఉంటుంది.. ఉండాలని అభిమానులు ఆశిస్తున్నారు.. కోరుకుంటున్నారు.



Tags:    

Similar News