రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్.. రామ్ చరణ్ లు హీరోలుగా నటించిన ఆర్ ఆర్ ఆర్ సంక్రాంతికి ముందు జనవరి 7వ తారీకున ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయడంకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రికార్డు బ్రేకింగ్ వసూళ్లను ఈ సినిమా దక్కించుకోవడం ఖాయం అంటూ అంతా నమ్మకంగా ఉన్నారు. ఒక వైపు ఒమిక్రాన్ భయం ఉన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో సినిమాను వాయిదా వేసేది లేదు అంటూ తేల్చి చెప్పేశారు. 50 శాతం ఆక్యుపెన్సీ... నైట్ కర్ఫ్యూ ఇలా ఏ ఇబ్బందులు ఉన్నా కూడా ఆర్ ఆర్ ఆర్ విడుదల మాత్రం పక్కా అని తేలిపోయింది. ఇక ఈ సినిమా కు మేకర్స్ చేస్తున్న పబ్లిసిటీ సినిమాపై అంచనాలు మరింతగా పెంచుతున్నాయి. ఇదే సమయంలో సినిమా గురించిన లీక్ లు.. పుకార్లు సోషల్ మీడియాలో రెగ్యులర్ గా వైరల్ అవుతూనే ఉన్నాయి.
సినిమా గురించి రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ఏదో ఒక పుకారు షికారు చేస్తూనే ఉంటుంది. తాజాగా సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్ అంటూ ఒక ఆసక్తికర సన్నివేశం గురించి చర్చ జరుగుతోంది. ఇంటర్వెల్ కు 15 నిమిషాల ముందు రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ల ఫైట్ మొదలు అవుతుందట. దాదాపుగా ఇద్దరి మద్య సాగే పది హేను నిమిషాల సన్నివేశాలు మరియు ఫైట్స్ ప్రేక్షకులను ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా చేస్తాయట. ఒకానొక సందర్బంలో విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఇద్దరు హీరోల మద్య ఒక ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ సమయంలో ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకుంటారని అన్నాడు. ఆ ఫైట్ ఇంటర్వెల్ కు ముందు వస్తుందని తాజా పుకారు. ఇద్దరి మద్య సన్నివేశాలు మరియు ఫైట్ ప్రేక్షకులను అలాగే చూస్తూ ఉండిపోయేలా ఉంటాయని పుకారు షికారు చేస్తోంది.
రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ల మద్య ఉండే ప్రతి ఒక్క సన్నివేశం కూడా ఇప్పటికి ఎప్పటికి మర్చి పోలేనిది అని.. మునుప్పెన్నడు చూడని విజువల్ వండర్ గా ఉంటాయని అంటున్నారు. ఇద్దరు హీరోలు ఒకే సారి స్క్రీన్ పై చూస్తే సాదారణంగానే హైప్ ఆహా అన్నట్లుగా ఉంటుంది. ఇక రాజమౌళి వంటి ఒక స్టార్ క్రియేటర్ ఒక భారీ యాక్షన్ ఎలివేషన్ లేదా.. ఎమోషనల్ సన్నివేశంలో వారిద్దరిని కలిపి చూపిస్తే ఇంకా ఏమైనా ఉందా.. ప్రేక్షకులు అలా కళ్లు పెద్దవి చేసి చూడటం తప్ప ఏం చేస్తారు. రాజమౌళి ఆవిష్కరించిన ఆర్ ఆర్ ఆర్ అద్బుతంకు సంబంధించిన విజువల్స్ ఇప్పటికే టీజర్.. ట్రైలర్.. గ్లిమ్స్ రూపంలో వచ్చాయి. కనుక ఆర్ ఆర్ ఆర్ సినిమా మహాద్బుతం అన్నట్లుగా జనాలు వెయిట్ చేస్తున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ గురించి జరుగుతున్న ప్రచారం నిజం కాకున్నా కూడా అంతకు మించిన సన్నివేశం ఇంటర్వెల్ ముందు పెట్టగల సమర్థుడు దర్శక ధీరుడు రాజమౌళి అనడంలో సందేహం లేదు.