జ‌పాన్‌ కు జ‌క్క‌న్న అండ్ కో

Update: 2018-04-18 06:40 GMT
బాహుబ‌లి... భారతీయ చ‌రిత్ర‌లో ఓ సంచ‌ల‌నం. ఓ ప్రాంతీయ చిత్రం అంత‌ర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకోవ‌డం చాలా అరుదు. ఆ స్థాయిని అందుకుంది బాహుబ‌లి సిరీస్‌. ఈ సినిమా ఇండియాలోనే కాదు ఫ్రాన్స్‌, జ‌పాన్ ఇలా ప‌రాయి దేశాల్లో కూడా విడుద‌ల చేశారు. ఎంత పెద్ద హిట్ కొట్టిందో... ప‌రాయి దేశ‌మైనా జ‌పాన్‌లో కూడా అంతే హిట్ కొట్టింది. శ‌త‌దినోత్స‌వం పూర్తి చేసుకుని... కోట్ల రూపాయ‌లు వ‌సూలు చేసింది. అందుకే త్వ‌ర‌లో బాహుబ‌లి టీమ్ జ‌పాన్ వెళ్లాల‌ని ప్లానింగ్‌లో ఉంద‌ట‌.

రాజ‌మౌళి అయిదేళ్ల క‌ష్టానికి ప్ర‌తి రూప‌మే బాహుబ‌లి. జపాన్‌లో క‌లెక్ష‌న్ల సునామీ సృష్టించింది. ఈ చిత్ర నిర్మాత శోభు యార్ల‌గ‌డ్డ ట్వీటు ద్వారా ఈ విష‌యాన్ని తెలియ‌జేశారు. డిసెంబ‌ర్ 29న బాహుబ‌లి 2 జ‌పాన్లో విడుద‌లైంద‌ని ఇప్ప‌టి వ‌ర‌కు ఆడుతూనే ఉంద‌ని పేర్కొన్నారు. 1.3 మిలియ‌న్ డాల‌ర్లు వ‌సూలు చేసిన‌ట్టు చెప్పారు. అత‌నే జ‌పాన్ టూర్ కూడా ప్లాన్ చేసిన‌ట్టు స‌మాచారం. రాజ‌మౌళి కూడా త‌న కుటుంబ‌స‌భ్యుల‌తో జపాన్ వెళ్ల‌డానికి సిద్ధ‌ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది. జపాన్లో బాహుబ‌లి స‌క్సెస్‌ను అక్క‌డి అభిమానుల మ‌ధ్య వేడుక‌గా చేసుకోవాల‌ని భావిస్తున్నార‌ట‌.

బాహుబ‌లి ఇటీవ‌ల ప్ర‌క‌టించిన జాతీయ అవార్డుల‌లో మూడింటిని సొంతం చేసుకుంది. బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్, బెస్ట్ యాక్షన్ డైరెక్షన్, బెస్ట్ పాపులర్ ఫిల్మ్ విభాగాల్లో ‘బాహుబలి 2’ జాతీయ అవార్డులను దక్కించుకుంది. ఇంకా ఆ ఆనందంలో మునిగి తేలుతున్న టీమ్‌కి .... ఇప్పుడు జ‌పాన్లో బాహుబ‌లి శ‌త‌దినోత్స‌వం మ‌రింత ఉత్సాహాన్ని ఇచ్చింది.
Tags:    

Similar News