రాజమౌళి తానుగా చెప్పకపోయినా ఆర్ ఆర్ ఆర్ కు సంబంధించిన అప్ డేట్స్ లీకుల రూపంలో బయటికి వస్తూనే ఉన్నాయి . మొదటి రోజు నుంచి త్వరలో వెళ్లనున్న కోలకతా షెడ్యూల్ దాకా సమాచారం అందుతూనే ఉంది, ఇది విడుదల అయ్యే దాకా జరిగే ప్రహసనమే కాబట్టి ఆపడం ఎవరి తరం కాదు. అయితే యూనిట్ తరఫున అప్పుడప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటే పుకార్లకు ఎక్కువ స్కోప్ దొరక్కుండా అడ్డుకోవచ్చు.
ఇప్పటికే హీరొయిన్ల ఎంపిక విషయంలో రాజమౌళి కన్నా ఎక్కువ శ్రద్ధ మీడియానే వహిస్తోందని జరుగుతున్న ప్రచారాన్ని బట్టే చెప్పొచ్చు. అందుకే త్వరలో జక్కన్న ప్రెస్ మీట్ పెట్టబోతున్నాడని తెలిసింది. అయితే ఎప్పుడు ఎక్కడ అనే వివరం మాత్రం తెలియలేదు. బహుశా కోల్కతాకు బయలుదేరే ముందు చెబుతాడేమో చూడాలి
ఇప్పడు రాజమౌళి క్లారిటీ ఇవ్వాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఒకటి హీరొయిన్ల సెలక్షన్. రెండు మిగిలిన సపోర్టింగ్ కాస్ట్ ఎవరు ఉన్నారు అనే స్పష్టత. తర్వాత ఇది ఎప్పుడు విడుదల చేయబోతున్నారు అనే ప్రాధమిక సమాచారం. ప్రస్తుతానికి ఇవి ఇస్తే తర్వాత మిగిలినవి టైం ని బట్టి చెబుతూ వెళ్ళొచ్చు. మరి నిజంగా ప్రెస్ మీట్ పెట్టి ఇవన్ని రాజమౌళి చెబుతాడా అంటే జరిగే దాకా నమ్మలేని పరిస్థితి.
వచ్చే ఏడాది సమ్మర్ ని టార్గెట్ చేసిన ఆర్ ఆర్ ఆర్ టైటిల్ కూడా ఇంకా రివీల్ చేయాల్సి ఉంది. ఆర్ ఆర్ ఆర్ అంటే ఈ ముగ్గురి పేర్లు అని సింక్ చేసుకున్నారు కాని నిజానికి కథకు సరిపోయేలా ఈ మూడు ఆర్లు కలిసి వచ్చేలా ఏదైనా రాజమౌళి అనుకున్నాడేమో తెలియదు.