యాంగ్రీమేన్ తెలంగాణ యాస‌?

Update: 2018-08-21 17:47 GMT
యాంగ్రీ హీరోగా రాజ‌శేఖ‌ర్ ద‌శాబ్ధాల పాటు అభిమానుల గుండెల్లో నిలిచాడు. ఆహుతి - త‌లంబ్రాలు సినిమాల‌తో నాడు అద్భుత‌మైన ఫాలోయింగ్ తెచ్చుకున్న రాజ‌శేఖ‌ర్ కాల‌క్ర‌మంలో స‌మ‌కాలిక హీరోల‌తో రేసింగ్ న‌డిపించారు. అయితే రీసెంట్ టైమ్స్‌ లో రేసులో కాస్తంత వెన‌క‌బ‌డ్డారనే చెప్పాలి. అయినా మొక్క‌వోని ధీక్ష‌తో అత‌డు కెరీర్ బండిని తిరిగి ట్రాక్‌ లోకి తెచ్చేందుకు ప్ర‌య‌త్నించిన తీరును ప్ర‌శంసించాలి.

రాజ‌శేఖ‌ర్ రీసెంటుగానే పిఎస్‌ వి గ‌రుడ‌వేగ లాంటి సినిమాతో బ్లాక్‌ బ‌స్ట‌ర్ హిట్ కొట్టారు. ఈ సినిమా రిలీజై అప్పుడే ఏడాది అయిపోతోంది. అయినా ఇంకా కొత్త సినిమా ప్రారంభించ‌నే లేదు ఎందుక‌నో. అయితే ఒక హిట్టు వ‌చ్చిన వెంట‌నే కంగారు ప‌డిపోకుండా సెల‌క్టివ్‌ గా క‌థ‌ల్ని - ద‌ర్శ‌కుల్ని ఎంచుకుంటున్నార‌ని అర్థ‌మ‌వుతోంది. అ! లాంటి ప్ర‌యోగాత్మ‌క చిత్రంతో బంప‌ర్‌ హిట్ కొట్టిన న‌వ‌త‌రం ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ వినిపించిన క‌థ‌కు ఓకే చెప్పార‌ని ఇదివ‌ర‌కూ ప్ర‌చారం సాగింది. ప్ర‌శాంత్ ప్ర‌స్తుతం మ‌రో ప్ర‌యోగాత్మ‌క క‌థ‌తోనే రెండో సినిమా తెర‌కెక్కించ‌నున్నాడ‌ని తెలుస్తోంది.

1983 కాలంలో సాగే ఆస‌క్తిక‌ర క‌థాంశాన్ని రాజ‌శేఖ‌ర్‌ కి వినిపించాడ‌ట‌. మునుపెన్న‌డూ తెలుగు తెర‌పై చూడ‌ని విధంగా ఉంటుంద‌ని తెలుస్తోంది. ఈ మూవీకి తెలంగాణ యాస ఎంతో కీల‌కం కావ‌డంతో ఆ యాస‌లో బాగా రాయ‌గ‌లిగే మాట‌ల ర‌చ‌యిత కావాల‌ని ట్విట్ చేశాడు ప్ర‌శాంత్. అంటే తెలంగాణ యాక్సెంట్‌ పై ప‌ట్టు ఉన్న ర‌చ‌యిత‌కే ఈ అవ‌కాశం. అంతా బాగానే ఉంది కానీ ఈ చిత్రంలో రాజ‌శేఖ‌ర్ పూర్తిగా నైజాం యాక్సెంట్ మాట్లాడ‌తారా? ఒక‌వేళ అదే నిజ‌మైతే.. అందుకు కాస్తంత  ప్రాక్టీస్ త‌ప్ప‌నిస‌రి.
Tags:    

Similar News