ముప్పై ఏళ్ళ క్రితం చిరంజీవి బాలకృష్ణల మాస్ సినిమాల యుద్ధంలో ఓ కొత్త తరంగంలా దూసుకువచ్చి యాంగ్రీ యంగ్ మ్యాన్ గా సెటిలైపోయిన రాజశేఖర్ చాలా ఏళ్ళు తనకంటూ స్వంత ఫ్యాన్ ఫాలోయింగ్ మైంటైన్ చేసారు. ఇప్పటికీ ఆయనంటే అభిమానించే వాళ్ళు ఉన్నారు కానీ అప్పట్లోలా అభిమానుల సంఘాల పేరుతో చేసే హడావిడి మాత్రం దాదాపు తగ్గిపోయింది. గత ఏడాది తన ,మార్కెట్ కి మించిన రిస్క్ తో చేసిన గరుడవేగా ప్రేక్షకుల దగ్గర పాస్ మార్కులు వేయించుకుంది కానీ బడ్జెట్ కారణంగా కమర్షియల్ ఫెయిల్యూర్ గానే మిగిలింది. కానీ రాజశేఖర్ లో ఇంకా హీరో ఉన్నాడని మాత్రం ప్రూవ్ చేసింది. ఇప్పుడు తన కొత్త సినిమా కోసం రెడీ అవుతున్న రాజశేఖర్ కు అందులో కొంత కీలక భాగం తెలంగాణ స్లాంగ్ లో ఉంటుందట. మామూలుగా రాజశేఖర్ ఇప్పటి దాకా తన సొంత గొంతు సినిమాలకు వాడలేదు. కెరీర్ ఉచ్చదశ మొత్తం డైలాగ్ కింగ్ సాయి కుమార్ సహాయంతో నడిచిపోయింది. పోలీస్ స్టోరీతో ఆయన హీరో అయ్యాక వేరే గొంతులతో ఏదోలా మేనేజ్ చేసుకుంటూ వచ్చారు. అలా చాలా ఏళ్ళు గడిచాయి.
ఎవడైతే నాకేంటితో తిరిగి సాయి కుమార్ రాజశేఖర్ కు గాత్ర దానం రీ స్టార్ట్ చేసాడు. గరుడవేగా దాకా ఇదే కొనసాగింది. ఇప్పుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో 80వ దశకం బ్యాక్ డ్రాప్ లో తీయబోతున్న సినిమాలో కూడా రాజశేఖర్ ఏదో ఇన్వెస్టిగేటివ్ పాత్ర చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రచారంలో ఉంది. మొన్న వదిలిన పోస్టర్ కూడా వెరైటీగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు తెలంగాణ స్లాంగ్ అంటే అలవాటు లేని రాజశేఖర్ ఎలా మేనేజ్ చేస్తాడా అనే అనుమానం రావడం సహజమే. సాయి కుమార్ టచ్ లో నే ఉన్నాడు కాబట్టి దీనికైనా నో చెప్పడు కానీ స్లాంగ్ ని ప్రత్యేకంగా నేర్చుకోవాల్సి వస్తుందేమో. ఎందుకంటే నటుడిగా కూడా సాయి కుమార్ సైతం అలాంటి పాత్ర చేయలేదు. అ!! లాంటి విభిన్నమైన సినిమాతో ఆకట్టుకున్న ప్రశాంత్ వర్మ ఇటీవలే క్వీన్ రీమేక్ దటీజ్ మహాలక్ష్మిని పూర్తి చేసాడు. కానీ దాన్ని రెండో సినిమాగా మాత్రం ఒప్పుకోవడం లేదు. అది పూర్తి కావడానికి సహాయం మాత్రమే చేసానని రెండో సినిమా మాత్రం రాజశేఖర్ దే అంటున్నాడు. ప్రస్తుతం అచ్చ తెలంగాణలో డైలాగ్స్ రాసే రచయిత వేటలో పడ్డాడీ యంగ్ డైరెక్టర్.