మెగా నిర్మాత అల్లు అరవింద్ తో మెగాస్టార్ చిరంజీవికి సరిపడడం లేదని చాలా కాలంగా ప్రచారమవుతోంది. ఆ క్రమంలోనే బావమరిది అరవింద్ ని చిరు పక్కన పెట్టేశారని.. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో నటించడం లేదని పరిశ్రమ ఇన్ సైడ్ గుసగుసలు వినిపించాయి. కొణిదెల కాంపౌండ్ సహా బయటి బ్యానర్లలో నటిస్తున్నా.. అరవింద్ కి అవకాశం ఇవ్వకపోవడంపైనా రకరకాల గుసగుసలు వేడెక్కిస్తున్నాయి.
బావ చిరంజీవి ఛాన్సివ్వకపోవడం వల్లనే వైరి వర్గం అయినా .. హీరో రాజశేఖర్ తో అల్లు అరవింద్ సినిమా చేస్తున్నారని తాజాగా మరో ప్రచారం ఫిలింసర్కిల్స్ లో వేడెక్కిస్తోంది. యాంగ్రీ హీరోతో జోసెఫ్ అనే మలయాల బ్లాక్ బస్టర్ ని రీమేక్ చేసేందుకు అరవింద్ సన్నాహాలు చేస్తున్నారన్న ప్రచారం ఉంది. గీతా ఆర్ట్స్ 2లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి పలాస 1978 కరుణ కుమార్ ఈ రీమేక్ కి దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందిట.
అయితే ఇదంతా ఎందుకు చేస్తున్నారు అరవింద్? చిరుకి రాజశేఖర్ బద్ధశత్రువుగా కొనసాగుతున్నారు. మొన్నటికి మొన్న మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) డైరీ 2020 ఆవిష్కరణ కార్యక్రమంలో రాజశేఖర్ అనుచిత ప్రవర్తన తెలిసిందే. దానిపై చిరంజీవి ఎంతో సీరియస్ అయ్యారు. క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంది. రాజశేఖర్ `మా` పదవికి రాజీనామా చేసేంత వరకూ వెళ్లింది. అన్ని ఘటనల తర్వాతా చిరు వ్యతిరేకి రాజశేఖర్ ని పిలిచి మెగా నిర్మాత అల్లు అరవింద్ అవకాశం ఎలా ఇస్తారు? అన్న గుసగుస వేడెక్కిస్తోంది.
అయితే బిజినెస్ మేన్ అల్లు అరవింద్ ఆలోచనల్ని ఔపోషణ పట్టిన వాళ్లు మాత్రం వేరొక రకంగానూ విశ్లేషిస్తున్నారు. జోసెఫ్ చిత్రం ఓ పదవీ విరమణ చేసిన పోలీసాఫీసర్ కథ. రాజశేఖర్ కి ఆవేశపరుడైన పోలీస్ అధికారిగా మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. అందుకే అరవింద్ పిలిచి మరీ రీమేక్ లో ఛాన్సిస్తున్నారని విశ్లేషిస్తున్నారు. చిరంజీవిపై కోపంతో కంటే బిజినెస్ అన్న కోణంలోనే అరవింద్ ఈ ఆఫర్ ఇచ్చి ఉంటారన్న విశ్లేషణ ఉంది. మరి ప్రస్తుతం సాగుతున్న ప్రచారంలో ఏది నిజమో.. ఏది అబద్ధమో.. రాజశేఖర్ మూవీ అనౌన్స్ మెంట్ రోజు అరవింద్ క్లానిటీనిస్తారేమో చూడాలి.