తన కొత్త సినిమా ‘గరుడవేగ’ ఎలా ఉంటుందో తాను చెప్పనంటున్నాడు రాజశేఖర్. ప్రేక్షకులే సినిమా చూసి తీర్పు చెప్పాలని అతనన్నాడు. ఇంతకుముందు తాను సూపర్ అన్న సినిమాలు తేడా కొట్టాయని.. కాబట్టి ‘గరుడవేగ’ గురించి అలా ఏమీ చెప్పనని రాజశేఖర్ చెప్పాడు.
‘‘నా సినిమా సూపర్.. డూపర్.. అదిరిపోయింది అంటే జనం నమ్మరు. ఎందుకంటే ఇది వరకు వచ్చిన నా సినిమాలు ‘గడ్డం గ్యాంగ్’.. ‘మహంకాళి’ సినిమాల గురించి అచ్చంగా ఇలాంటి మాటలే చెప్పాను. ఆ సినిమాలు ఆడలేదు. ఇప్పుడు ‘గరుడవేగ’ గురించి కూడా అవే మాటలు చెబితే.. ఈ సినిమా కూడా అలాగే అవుతుందనుకుంటారు. కాబట్టి ఏమీ మాట్లాడను. ప్రేక్షకులే రేపు సినిమా చూసి తమ అభిప్రాయం చెబుతారు. ఒక్కటి మాత్రం వాస్తవం. నేను ఇప్పటిదాకా చేసిన సినిమాలు ఒకెత్తు. ‘గరుడవేగ’ ఇంకో ఎత్తు. నా అత్యంత సంతృప్తినిచ్చిన సినిమాల్లో ఇదొకటి’’ అని రాజశేఖర్ అన్నాడు.
‘గరుడవేగ’ బడ్జెట్ ఎక్కువవడంపై రాజశేఖర్ స్పందిస్తూ.. ‘‘ముందు ఏడెనిమిది కోట్లలోనే సినిమా చేద్దామనుకున్నాం. నాతో సినిమా చేయాలని ఎప్పట్నుంచో ఆశ పడుతున్న మా నాన్న గారి స్నేహితుడు కోటేశ్వరరాజుకు ఈ సినిమాను అప్పగించాం. కానీ ఆయన కథను నమ్మి ఎంతైనా ఖర్చు పెట్టడానికి ముందుకొచ్చారు. క్వాలిటీ కోసం తపించారు. అందుకే అంత బడ్జెట్ అయింది. కానీ సినిమా బాగా ఆడితే డబ్బులు వెనక్కి వస్తాయని నమ్ముతున్నాం’’ అని చెప్పాడు.